Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..

ABN , First Publish Date - 2023-09-02T19:24:28+05:30 IST

సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా మేకర్స్ వదులుతున్నారు. అర్ధరాత్రి ‘హరిహర వీరమల్లు’ పవర్ ఫుల్‌ పోస్టర్‌తో మొదలై.. ఉదయం ‘OG’ గ్లింప్స్.. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ న్యూ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు ఆయా చిత్రాల మేకర్స్.

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..
Pawan Kalyan in Ustaad Bhagat Singh

సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా మేకర్స్ వదులుతున్నారు. అర్ధరాత్రి ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పవర్ ఫుల్‌ పోస్టర్‌తో మొదలైన బర్త్‌డే ట్రీట్.. ఉదయం 10 గంటల సమయానికి పీక్స్‌కి వెళ్లిపోయింది. ‘OG’ గ్లింప్స్‌తో (OG Glimpse) ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. ఇక ఫైనల్ టచ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) నుంచి మేకర్స్ కొత్త పోస్టర్‌‌ని విడుదల చేశారు.


ఇంతకు ముందు వచ్చిన ‘ఓజీ’ గ్లింప్స్‌లో ఎలా అయితే పవన్ కళ్యాణ్‌తో కత్తి పట్టించి రక్తం ఏరులయ్యేలా చూపించారో.. తాజాగా విడుదల చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్‌లోనూ కత్తితోనే పవన్ కళ్యాణ్ దర్శనమిచ్చారు. ఈ పోస్టర్‌లో ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ ధరించి, స్పోర్ట్స్ షేడ్స్‌తో పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్‌ని పరిచయం చేశారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని సరికొత్తగా మాస్ క్యారెక్టర్‌లో చూపిస్తున్నారు. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ రక్తంతో తడిచిన కత్తి పట్టుకుని వుండగా, అతని వెనుక కొంత మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ అనే చెప్పాలి. (Ustaad Bhagat Singh Mass Swag Poster Out)

Ustaad-Bhagat-Singh.jpg

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌‌లు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ నెల 5 నుండి ఈ సినిమా షూటింగ్‌‌ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ని మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

************************************

*Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..

*************************************

*Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..

*************************************

*Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!

*************************************

*Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!

**************************************

Updated Date - 2023-09-02T19:24:28+05:30 IST