Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు

ABN , First Publish Date - 2023-08-03T18:00:53+05:30 IST

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘స్కంద’. సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని గురువారం విడుదల చేశారు. ‘నీ చుట్టు చుట్టు’ అంటూ సాగిన ఈ పాటకు థమన్ సంగీతం అందించారు.

Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు
Skanda Movie Still

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu), ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni) కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్కంద’. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. గురువారం చిత్ర ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.


‘‘నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా..

నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండె నడిగినా..

నా దిమ్మదిరిగే బొమ్మ ఎవరిదంటే.. నిన్ను చూపుతోందిగా..

ఓ దమ్ములాగి గుమ్మతో రిథమ్ము కలిపి ఆడమందిగా..

ప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగా..

ఇంతలో తతంగమంత మారుతోందిగా..’’ అంటూ సాగిన ఈ పాట కోసం కంపోజర్ ఎస్ థమన్ మాస్ బీట్‌లతో చాలా రిథమిక్‌గా ఉండే క్రేజీ లిరిక్స్‌తో పెప్పీ, మాస్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే (Sid Sriram and Sanjana Kalmanje) హుషారుగా పాడిన ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్‌ మరింత ఆకర్షణగా నిలిచాయి. రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల (Sreeleela), రామ్‌ ఎనర్జీ‌ని మ్యాచ్ చేస్తూ వేసిన స్టెప్స్ కనువిందుగా ఉన్నాయి. ఇద్దరూ ఎలిగెంట్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. కాస్ట్యూమ్స్‌, కలర్‌ఫుల్‌ సెట్‌ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. (Nee Chuttu Chuttu Lyrical Video From Skanda)

Ram.jpg

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవరిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!

**************************************

*Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?

**************************************

*Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే

**************************************

*VK Naresh: కోర్టులో నరేష్‌కి ఊరట.. రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం

********************************************

*Kalyani: దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

**************************************

Updated Date - 2023-08-03T18:00:53+05:30 IST