Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?

ABN , First Publish Date - 2023-08-02T17:27:55+05:30 IST

నటి పూనమ్ కౌర్ చేసే ట్వీట్స్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. ఆమె చేసే ట్వీట్స్ అర్థం కావు కానీ.. ఏదో నిగూడార్థం అయితే ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. అవే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా ఆమె పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు లింక్ చేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?
Poonam Kaur

నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) చేసే ట్వీట్స్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. ఆమె చేసే ట్వీట్స్ అర్థం కావు కానీ.. ఏదో నిగూడార్థం అయితే ఉన్నట్లుగా అనిపిస్తుంటాయి. అవే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఆమె చేసే ట్వీట్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరో, స్టార్ దర్శకుడిని ఉద్దేశించే అన్నట్లుగా ఉంటాయి కానీ.. క్లారిటీ మాత్రం ఉండదు. ఇప్పుడలాంటి ట్వీటే ఒకటి పూనమ్ కౌర్ చేయగా.. ఆ ట్వీటే ఇప్పుడామెను మళ్లీ వార్తలలో నిలిచేలా చేస్తోంది.


‘‘ఈ మధ్య రాజకీయాలు వినోదానికి వేదిక అయ్యాయి.. అదే సమయంలో వినోదం మాత్రం సీరియస్‌గా మారిపోయింది’’ అని పూనమ్ కౌర్ ఓ ట్వీట్ (Poonam Kaur Tweet) చేశారు. ఈ ట్వీట్‌కు అర్థం ఏమిటంటే.. సినిమాలలో ఉండాల్సిన వినోదం (Entertainment) రాజకీయాలలో దొరుకుతుంది. రాజకీయాలలో (Politics) ఉండాల్సిన సీరియస్‌నెస్ సినిమాలలో ఉంటుంది. అంతా రివర్స్ అవుతుందనే అర్థం వచ్చేలా.. పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. అయితే ఆమె ఈ ట్వీట్ చేయడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ (Pawan Kalyan film Bro) అనేలా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Kaur.jpg

ఈ సినిమా విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు (YSRCP Leader Ambati Rambabu) కొన్ని రోజులుగా ఎలా ఎంటర్‌టైన్ చేస్తున్నారో తెలియంది కాదు. సినిమా వాళ్లని బెదిరిస్తూ.. ఆయన మాట్లాడుతోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో రాజశేఖర్‌ని ఇమిటేట్ చేసినప్పుడు.. ఆయన వరకు విషయం వెళితే.. ‘పోనీలే ఈ రూపంలో అయినా ఆయనకో హిట్ వచ్చింది’ అని ఒకే ఒక్క మాటతో తెగ్గేట్టేశారు. కానీ అంబటి మాత్రం ఢిల్లీ పోతా.. స్కాం ఇది.. అంటూ ఏవేవో మాట్లాడుతూ.. రాద్ధాంతం చేస్తున్నారు. అయితే ఆయన పెట్టుకున్న ఈ కార్యక్రమం సినిమాకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెడుతుండటం విశేషం. అందుకే పూనమ్ ఈ విషయాన్ని ఇలా ట్వీట్ చేసిందనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే

**************************************

*VK Naresh: కోర్టులో నరేష్‌కి ఊరట.. రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం

********************************************

*Kalyani: దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

**************************************

*VD13: సెట్స్‌లో మృణాల్‌ని సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ

**************************************

*Pawan Kalyan: సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా..

**************************************

Updated Date - 2023-08-02T17:27:55+05:30 IST