Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!

ABN , First Publish Date - 2023-08-02T20:00:12+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్‌’. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్‌తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌‌ని ఈ సినిమా ఇవ్వబోతుందనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.

Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!
Rajinikanth Jailer Poster

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్‌’ (Jailer). యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘కావాలయ్య, హుకుం’ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా ‘జైలర్’ థియేట్రికల్ ట్రైలర్‌ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ట్రైలర్ విషయానికి వస్తే.. రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. రజనీ తనదైన మార్క్ నటనతో కట్టిపడేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్‌తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ని అందిస్తూ సినిమాపై క్యురియాసిటీని పెంచేస్తోందీ ట్రైలర్. దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ పాత్రని చాలా యూనిక్ అండ్ పవర్ ఫుల్‌గా డిజైన్ చేసి తన దర్శకత్వ ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు వండర్ ఫుల్‌గా వున్నాయి. అలాగే నెల్సన్ మార్క్ వినోదం కూడా కనిపిస్తోంది. ట్రైలర్‌లో జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ‌ల ప్రజన్స్ కూడా ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ తమన్నాకు మాత్రం ఇందులో చోటు దక్కలేదు. (Jailer Trailer Talk)

టెక్నికల్‌గా అనిరుధ్ బ్రిలియంట్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా వర్క్ హైలెట్ అనేలా ఉంది. ట్రైలర్ చివరిలో ‘హుకుం.. టైగర్ కా హుకం’ అని రజనీ చెప్పిన డైలాగు అభిమానులను ఉర్రూతలూగించి అంచనాలని మరింతగా పెంచేసింది. ఈ సినిమా ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. (Jailer Movie)


ఇవి కూడా చదవండి:

**************************************

*Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?

**************************************

*Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే

**************************************

*VK Naresh: కోర్టులో నరేష్‌కి ఊరట.. రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం

********************************************

*Kalyani: దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

**************************************

*VD13: సెట్స్‌లో మృణాల్‌ని సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ

**************************************

Updated Date - 2023-08-02T20:50:22+05:30 IST