సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?

ABN, First Publish Date - 2023-04-27T16:20:59+05:30

త్రిష (Trisha) యువరాణి కుందవైగా నటించారు. ఇపుడు కుందవైకు ఉన్న ఇతర పేర్లు ఏంటి? అనే ప్రశ్నను త్రిష తన అభిమానులకు సంధించింది. ఈ ప్రశ్నకు జవాబును

Ponniyin Selvan Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో విక్రమ్‌, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్‌, పార్తిబన్‌, ప్రకాష్‌ రాజ్‌, జయరాం, విక్రమ్‌ ప్రభు, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు నటించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ (Ponniyin Selvan 2). ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్ర బృందం నిమగ్నమైవుంది. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తోంది. ఈ మూవీలో త్రిష (Trisha) యువరాణి కుందవైగా నటించారు. ఇపుడు కుందవైకు ఉన్న ఇతర పేర్లు ఏంటి? (Can you tell us the other names of princess #Kundavai?) అనే ప్రశ్నను త్రిష తన అభిమానులకు సంధించింది. ఈ ప్రశ్నకు జవాబును ఒక సెల్ఫీ వీడియోతో తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో అభిమానులు తమకు తెలిసిన సమాధానాలను సెల్ఫీ వీడియో రూపంలో షేర్‌ చేస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమా ప్రస్తుతం ప్రచారాన్ని పొందుతోంది. నెటిజన్లు చాలా మంది తమకు తెలిసిన అర్థాన్ని వీడియోల రూపంలో షేర్ చేస్తుండగా.. మూవీ యూనిట్ వాటిని మళ్లీ రీ ట్వీట్ చేస్తోంది.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌ (Subaskaran), మ‌ణిర‌త్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ తెరకెక్కింది. గ‌త ఏడాది విడుద‌లైన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన విషయం తెలిసిందే. పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని మ‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు.

ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ‘పొన్నియిన్ సెల్వ‌న్ 2’ (Ponniyin Selvan 2) విడుద‌ల‌వుతుంది. కల్కి నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూర్చారు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

*Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

Updated Date - 2023-04-27T16:20:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!