సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#LalSalaam: ట్రెండింగ్‌లో సూపర్ స్టార్ సినిమా టైటిల్..

ABN, First Publish Date - 2023-03-07T14:51:41+05:30

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Rajinikanth
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలే. ఈ స్టార్ ప్రస్తుతం ‘జైలర్’ (Jailer) అనే మూవీ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఇటీవల రజనీతో ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లాల్ సలామ్’ (LalSalaam) టైటిల్‌తో తెరకెక్కునున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని, ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని కూడా లైకా వారు తెలిపారు. తాజాగా హోలీ‌ని పురస్కరించుకుని ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్ లుక్ చూస్తుంటే.. ఇదొక స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్‌గా అనిపిస్తోంది.

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సీనియర్ నటి జీవితా రాజశేఖర్ నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఇటీవలే చిత్రజ్యోతి ప్రకటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరి పాత్రలో ఆమె ఇందులో కనిపించనున్నారు.

Read This: రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్, ఏ పాత్రో తెలుసా?


ఈ రోజు (మార్చి 7న) నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లుగా తెలుపుతూ.. లైకా వారు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో #LalSalaam, #Rajinikanth అనే యాష్ ట్యాగ్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అవ్వాలంటూ సూపర్‌స్టార్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-07T15:39:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!