D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం

ABN , First Publish Date - 2023-06-30T18:23:25+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను కోల్పోయిన విద్యార్థిని అముద (Amuda)కు డి. ఇమ్మాన్ ఆర్థిక సాయం చేశారు. ఇటీవల చనిపోయిన ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌కు సైతం ఆయన స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే.

D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం
Music Director D Imman

కోలీవుడ్‌లో ఈ సంగీత దర్శకుడి పేరు రోజురోజుకి మారుమోగుతోంది. ఆయన చేసిన సినిమాలు పెద్ద హిట్ అవడమో, సంగీతం పరంగా ఆయనకు మంచి పేరు రావడం వల్లనో కాదు.. ఆయన చూపించే మానవత్వం కారణంగా డి. ఇమ్మాన్ (D Imman) పేరు వైరల్ అవుతోంది. తాజాగా ఆయన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను కోల్పోయిన విద్యార్థిని అముద (Amuda)కు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల చనిపోయిన ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌కు సైతం ఆయన స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇపుడు సేలం జిల్లా కల్పారైపట్టి, సెవ్వాయ్‌ కాట్టిల్‌ అనే ప్రాంతానికి చెందిన అముద అనే విద్యార్థిని పది, ప్లస్‌టూ పరీక్షల్లో మంచి మార్కులతో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. అయితే ఒక రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తల్లిదండ్రులతో పాటు అక్కను కూడా కోల్పోయి అనాథగా మిగిలింది. అదేసమయంలో తాను చదువుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయం సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్‌కి తెలిసింది.. దీంతో ఆయన స్పందించి ఆ విద్యార్థిని సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

Music.jpg

ఇంతకు ముందు కోలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ ప్రభు (Prabhu) అంత్యక్రియలను దగ్గరుండి మరీ ఆయన జరిపించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రభుకి.. వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో.. డాక్టర్స్ కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో ప్రభు మృతి చెందగా.. అతని అంత్యక్రియలను కూడా ఇమ్మానే దగ్గరుండి జరిపించారు. మానవత్వంతో ఈ సంగీత దర్శకుడు చేస్తున్న సాయంపై ఇప్పుడు తమిళ నాట అతనిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!


**************************************

*Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?

**************************************

*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..


**************************************

*Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..


**************************************

*Slum Dog Husband: నందమూరి హీరో చేతుల మీదుగా ట్రైలర్ విడుదల


**************************************

Updated Date - 2023-06-30T18:33:23+05:30 IST