Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-06-29T17:32:53+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో పి. వాసు తెరకెక్కిస్తున్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయక చవితికి విడుదల చేయబోతున్నట్లుగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..
Chandramukhi 2 Poster

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), పి. వాసు (P Vasu) కాంబినేషన్‌లో వచ్చిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రం ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో తెలిసిందే. మొదటి భాగం వచ్చిన దాదాపు 17 యేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌ రాబోతోంది. ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2) పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా.. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర విడుదల వివరాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని వదిలారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని రాబోయే వినాయక చవితి (Vinayaka Chavithi) పర్వదినాన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో రాఘవ లారెన్స్ ఓ తలుపు వైపు తీక్షణంగా చూస్తున్నారు. ఆ తలుపు హోల్‌లో నుంచి ఓ వెలుగు బయటికి వస్తుంది. తలుపు నిండా మంత్రించిన త్రిశూలంతో పాటు కొన్ని యంత్రాలను చూడవచ్చు. మొత్తం ఓ ఇంటెన్స్ లుక్‌‌ని వదిలిన మేకర్స్.. ఈ లుక్‌తోనే సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు. డైరెక్ట‌ర్ పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 65వ సినిమా ఇది. (Chandramukhi 2 Release Details)

Lawrence-Pic.jpg

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌, వడివేలు, రాధిక వంటివారు నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగు సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) సంగీతం సమకూర్చుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. తొలి భాగంలో రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార, ప్రభు, వడివేలు నటించగా, సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో ఈ రెండో భాగంపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ మాట్లాడుతూ.. ‘‘ఇండియన్ మూవీ హిస్ట‌రీలో ‘చంద్రముఖి’కి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. దానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మించేలానే మూవీ ఉంటుంది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Slum Dog Husband: నందమూరి హీరో చేతుల మీదుగా ట్రైలర్ విడుదల


**************************************

*Balakrishna and Sridevi Combo: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని మించి ఉండాల్సిన సినిమా.. ఆగిపోయింది


**************************************

*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!


**************************************

*Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు


**************************************

*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..


**************************************

Updated Date - 2023-06-29T18:10:52+05:30 IST