Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!

ABN , First Publish Date - 2023-06-29T22:09:56+05:30 IST

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా అరంగేట్రానికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో.. ఆమె విజయ్ సరసన తమిళ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది. అప్పట్లోనే టాలీవుడ్ ఎంట్రీకి కూడా ఆమె సిద్ధమైంది. నెక్కంటి శ్రీదేవి ఆమె డేట్స్ సంపాదించి.. ‘అపురూపం’ పేరుతో సినిమాని స్టార్ట్ చేసింది. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయినా కూడా ప్రియాంక చోప్రా స్టార్‌డమ్‌కేం లోటు రాలేదు. ఈ రోజు గ్లోబల్ స్టార్‌గా అత్యంత ఉన్నత స్థాయిలో ఆమె ఉంది.

Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!
Heroine Priyanka Chopra

ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) మొదలుకొని వెండితెరపై వెలుగుతున్న చాలామంది కథానాయికలు అందాల పోటీ నుంచి వచ్చిన వారే. అదే జాబితాకు చెందిన నటే ప్రియాంక చోప్రా (Priyanka Chopra). 1982 జpలై 18న జెంషేడ్ పూర్‌లో జన్మించిన ప్రియాంకది మిలటరీ నేపధ్య కుటుంబం. ఆమె తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు ఇద్దరూ ఇండియన్ ఆర్మీలో డాక్టర్లే (Priyanka Chopra Parents). తల్లితండ్రుల ఉద్యోగ రీత్యా దేశంలోని ఎన్నో ప్రాంతాలు చిన్నతనంలోనే చూసేశారు ప్రియాంక. 13 ఏళ్ల వయసులో పై చదువుల కోసం అమెరికా వెళ్లారు ప్రియాంక. వాళ్ళ అత్తయ్య కుటుంబం అక్కడ ఉండడంతో వాళ్ల ఇంట్లో ఉండి చదువు కొన్నారు. క్లాసికల్ మ్యూజిక్, కోరల్ సింగింగ్ కూడా నేర్చుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఇక్కడే పూర్తి చేశారు.

ప్రియాంకకు ఆసక్తి ఉండడంతో 2000వ సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలకు వాళ్ళ అమ్మ పంపించారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో ప్రియాంకకు రెండో స్థానం లభించింది. ఆ ఉత్సాహంతో 2000 మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని టైటిల్ పొందారు. ఆ వెంటే సినిమా రంగం నుంచి ఆఫర్లు ఆమెను చుట్టు ముట్టాయి. అయితే అప్పటికే ఓ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవడంతో సినిమాలకు సైన్ చేయలేక పోయారు. హిందీలో ఆమెకు వచ్చిన తొలి అవకాశం హంరాజ్. బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి ప్రియాంక చేజారిపోయింది. అప్పుడు ఆ పాత్రను అమీషా పటేల్ పోషించారు.

Priyanka-Chopra-2.jpg

అదే సమయంలో తమిళ నటుడు విజయ్ (Vijay) నటించిన తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. 2002 ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమానే ప్రియాంకకు తొలి సినిమా. ఆ సమయంలోనే చాలా మంది తెలుగు నిర్మాతల దృష్టిని ఆకర్షించారు ప్రియాంక. ఎంతోమంది నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ పోటీలో నెక్కంటి శ్రీదేవి (Nekkanti Sridevi) మాత్రమే ప్రియాంక డేట్స్ సంపాదించగలిగారు. 2002 లోనే ప్రారంభమైన ఆ చిత్రం పేరు ‘అపురూపం’ (Apurupam). సాయి రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రసన్న హీరో. హీరోయిన్‌గా తన తొలి పుట్టినరోజును ఈ చిత్ర షూటింగ్‌లోనే జరుపుకున్నారు ప్రియాంక. సగానికిపైగా పూర్తయిన ‘అపురూపం’ చిత్ర షూటింగ్ ఆర్ధిక కారణాల వల్ల ఆగిపోయింది. ఆ సినిమా విడుదల అయివుంటే ప్రియాంక హీరోయిన్‌గా తెలుగులో బిజీ అయి ఉండేవారేమో.

Priyanka-Chopra.jpg

అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. హిందీ సినిమాల్లో ట్రై చేసి అక్కడ బిజీ కాగలిగారు. మొదట్లో అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఒదిగి పోయారు. ఆ తర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించి జాతీయ అవార్డులు కూడా పొందారు. ఇప్పుడు ప్రియాంక ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. అంతే కాదు గ్లోబల్ స్టార్‌ (Global Star)గా కూడా ఎదిగారు. నిక్ జోనాస్‌ (Nick Jonas)ను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

-వినాయకరావు

ఇవి కూడా చదవండి:

**************************************

*Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?

**************************************

*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..


**************************************

*Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..


**************************************

*Slum Dog Husband: నందమూరి హీరో చేతుల మీదుగా ట్రైలర్ విడుదల


**************************************

*Balakrishna and Sridevi Combo: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని మించి ఉండాల్సిన సినిమా.. ఆగిపోయింది


**************************************

*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!


**************************************

Updated Date - 2023-06-29T22:09:56+05:30 IST