Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..

ABN , First Publish Date - 2023-06-29T19:36:26+05:30 IST

మేనమామ-మేనల్లుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..
Pawan Kalyan and Sai Dharam Tej in Bro

మేనమామ-మేనల్లుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై జీ స్టూడియోస్‌ (ZEE Studios)తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడా అంచనాలను డబుల్ చేసేలా.. ‘బ్రో’ టీజర్ (Bro Teaser)‌ను మేకర్స్ వదిలారు. ముందు చెప్పిన టైమ్ కంటే కాస్త ఆలస్యంగా ఈ టీజర్‌ని మేకర్స్ విడుదల చేసినప్పటికీ.. ఆ వెయిటింగ్‌కి సరిపడా వర్త్‌ని ఫ్యాన్స్‌కి ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎంట్రీ, డైలాగ్స్, సాయిధరమ్ తేజ్, మేకింగ్, మ్యూజిక్.. ఇలా ప్రతీది దేనికదే సాటి అనేలా ఈ టీజర్‌ ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతూ.. రికార్డులకు వేట మొదలెట్టింది.

టీజర్ విషయానికి వస్తే (Bro Teaser Talk).. ‘ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఎవరూ లేరా..?’ అంటూ సాయిధరమ్ తేజ్ వాయిస్‌తో మొదలైన ఈ టీజర్.. ‘ఏమండి ఎవరూ లేరా? హలో మాస్టారూ.. గురువు గారూ.. హలో తమ్ముడూ.. అంటూ ‘బ్రో’ అనగానే.. పెద్ద ఉరుము, మెరుపు అనంతరం తమ్ముడు సినిమాలోని ‘వయ్యారి భామ నీ హంస నడక’ సినిమాలోని పాటలో ఎలా అయితే పవన్ కల్యాణ్ కనిపించారో.. అలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంట్రీని చూపించారు. ‘వెల్‌కమ్ మార్క్ వెల్‌కమ్’ అంటూ ఓం లాకెట్ ధరించి, చిరునవ్వుతో పవన్ కల్యాణ్‌ను రివీల్ చేసిన తీరు ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పొచ్చు. (Bro Teaser Out)

Kalyan.jpg

‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ అంటూ సాయిధరమ్ తేజ్‌ని టీజ్ చేస్తూ.. ర్యాగింగ్ చేసే తీరు, ‘చిన్న పిల్లాడిని బ్రో’ అని సాయిధరమ్ తేజ్ చెప్పే డైలాగ్.. చివరిలో ‘సినిమాలెక్కువ సూత్తావంట్ర నువ్వు’ అని చిరు స్టయిల్‌లో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, టీజర్ మొత్తానికి థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌కి ట్రీట్ అన్నట్లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా టీజర్ అయితే సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగానే ఉంది. కాకపోతే స్టోరీకి సంబంధించి మాత్రం ఈ టీజర్‌లో ఏం రివీల్ చేయలేదు. ఆ కొరత ట్రైలర్‌తో తీర్చే అవకాశం ఉంది. టీజర్‌ మాత్రం పవర్ ప్యాక్‌డ్ అనేలా కట్ చేశారు. ఫాంటసీ, ఆధ్యాత్మికత అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. జూలై 28న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Slum Dog Husband: నందమూరి హీరో చేతుల మీదుగా ట్రైలర్ విడుదల


**************************************

*Balakrishna and Sridevi Combo: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని మించి ఉండాల్సిన సినిమా.. ఆగిపోయింది


**************************************

*Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!


**************************************

*Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు


**************************************

*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..


**************************************

Updated Date - 2023-06-29T19:36:26+05:30 IST