Meena: మళ్లీ కెమెరా ముందుకు మీనా..

ABN , First Publish Date - 2023-09-11T20:59:29+05:30 IST

భర్తను కోల్పోయి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్‌ నటి మీనా మళ్లీ కెమెరాముందుకు రానున్నారు. మలయాళ దర్శకుడు జయ జోస్‌ రాజ్‌ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నట్టు ఆమె స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు.

Meena: మళ్లీ కెమెరా ముందుకు మీనా..
Actress Meena

భర్తను కోల్పోయి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్‌ నటి మీనా (Actress Meena) మళ్లీ కెమెరాముందుకు రానున్నారు. మలయాళ దర్శకుడు జయ జోస్‌ రాజ్‌ (Jaya Jose Raj) తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నట్టు ఆమె స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. బాల నటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె... 1990 దశకంలో అగ్రహీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు. 2019లో విద్యాసాగర్‌ అనే పారిశ్రామికవేత్తను పెళ్లి చేసున్న ఆమెకు నైనిక అనే కుమార్తె ఉంది. గత యేడాది మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ దుఃఖం నుంచి తేరుకునేందుకు ఆమె పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు. (Meena Re Entry)

గత యేడాది నిర్వహించిన మీనా అభినందన సభకు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ (Super Star Rajinikanth) వంటి అగ్రహీరోలు పాల్గొని ఆమెలో మనోధైర్యాన్ని నింపారు. ఈ నేపథ్యంలో మీనా.. ఇపుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘మళ్లీ కెమెరా ముందు నిలబడటం ఆనందంగా ఉంది. మరో మరిచిపోలేని పాత్రలో నటిస్తున్నా’ అంటూ క్లాప్‌బోర్డు ఫొటోతో ఈ విషయాన్ని మీనా వెల్లడించారు. అయితే ఈ మధ్య మీనా మరో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.


Meena-pic.jpg

ఓ హీరోని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొందరు రూమర్స్ సృష్టించారు. అలాంటి రూమర్స్‌కి మీనా మౌనంతోనే సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే మళ్లీ నటించాలని రంగంలోకి దిగినట్లుగా సమాచారం. త్వరలో ఆమె టాలీవుడ్‌ (Tollywood)కి చెందిన ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

============================

*Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..

************************************

*Samyuktha Menon: క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’‌లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు

***********************************

*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?

**********************************

*Aadikeshava: వైష్ణవ్, శ్రీలీల కెమిస్ట్రీ హైలెట్‌గా ‘సిత్తరాల సిత్రావతి’

**********************************

Updated Date - 2023-09-11T20:59:29+05:30 IST