సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

ABN, First Publish Date - 2023-03-07T16:03:43+05:30

మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై (Anoop Pillai) తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని మలయాళ నటి అనికా విక్రమన్ (Anicka Vikhraman) తీవ్ర ఆరోపణలు చేసింది.

Anicka Vikhraman
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై (Anoop Pillai) తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని మలయాళ నటి అనికా విక్రమన్ (Anicka Vikhraman) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. అలాగే తన గాయాల ఫోటోలను సైతం నటి ఆ పోస్ట్‌లో పంచుకుంది. అలాగే అతనితో తనకి ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ రాసుకొచ్చింది. అనికా సోషల్ మీడియా పోస్ట్‌ ఆధారంగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. (Malayalam Actress)

అందులో.. ‘గతంలో నేను అనూప్ పిళ్లై అనే వ్యక్తిని ప్రేమించాను. అతను గత కొన్నేళ్లుగా నన్ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. అలాంటి మనిషిని ఇంతవరకు చూడలేదు. కొట్టడమే కాకుండా కాల్స్ చేసి భయపెడుతున్నాడు. అతను నాతో ఇలా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు. అతను నన్ను చెన్నైలో ఉండగా.. మొదటిసారి కొట్టాడు. అప్పుడు ఎలాంటి చర్య తీసుకోవద్దని నా కాళ్ల మీద ఏడిచాడు. అందుకే అప్పుడు అతనిపై కేసు పెట్టలేదు. కానీ రెండోసారి కూడా కొట్టడంతో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే వారికి డబ్బులిచ్చి మేనేజ్ చేశాడు.

అప్పటి నుంచి పోలీసుల అండ ఉందని ఎప్పుడు పడితే అప్పుడు నన్ను కొట్టేవాడు. అతను నన్ను చాలాసార్లు మోసం చేశాడు. అందుకే నేను అతన్ని వదిలేద్దామని అనుకున్నా. అయితే.. అతనికి మాత్రం ఆ ఉద్ధేశం లేదు. దాంతో ఇంకా హింసించేవాడు. అలాగే.. నా ఫోన్‌ని సైతం పగులగొట్టాడు. దీంతో షూటింగులకి కూడా వెళ్లలేకపోయాను. అంతేకాకుండా.. నాకు తెలియకుండా ల్యాప్‌టాప్‌‌కి నా వాట్సాప్‌ని కనెక్ట్ చేసి మేసేజులు మొత్తం చూసేవాడు’ అని అనికా తీవ్ర విమర్శలు చేసింది.

కాగా.. ‘కే’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమైన అనికా వరుస సినిమాలతో చేస్తూ బిజీగా ఉంది. ఈ నటి ప్రస్తుతం ‘ఎంగా పట్టన్ పాత్రియా’, ‘విశాచకరన్’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-07T16:18:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!