Shriya Saran: సౌతిండియాలో ఎప్పటికీ ఆయనే సూపర్‌స్టార్

ABN , First Publish Date - 2023-03-15T12:32:33+05:30 IST

‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమై స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన బ్యూటీ శ్రియా శరణ్ (Shriya Saran).

Shriya Saran: సౌతిండియాలో ఎప్పటికీ ఆయనే సూపర్‌స్టార్
Shriya Saran

‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమై స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన బ్యూటీ శ్రియా శరణ్ (Shriya Saran). అనంతరం తమిళంతోపాటు కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించి అక్కడ సైతం మంచి గుర్తింపునే సాధించింది. ఈ భామ తాజాగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) సరసన ‘కబ్జ’ (Kabzaa) అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా మార్చి 17న విడుదలకానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఈ చిత్రబృందం జోరుగా సాగిస్తోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో శ్రియ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Shriya-saran2.jpg

శ్రియ మాట్లాడుతూ.. ‘‘కబ్జ’ నా మనసుకు నచ్చిన చిత్రం. ఇందులో నటించేందుకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో శివాజీ మూవీలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు శంకర్‌కు ఈ సందర్భంగా మరోమారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆ సమయంలో రజనీకాంత్‌తో నటించే సమయంలో నేనే వ్యక్తిగతంగా అనేక విషయాలు నేర్చుకున్నా. విజయాన్ని తలకు ఎక్కించుకోకుండా, సాదాసీదా ఎలా ఉండాలో ఆయన్ను చూసి నేర్చుకోవచ్చు. మళ్లీ ఆయనతో కలిసి నటించాలని ఆశపడుతున్నా. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎప్పటికీ ఆయనే సూపర్‌స్టార్‌’ అని శ్రియ అన్నారు.

Shriya-saran1.jpg

ఇవి కూడా చదవండి:

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-15T12:34:49+05:30 IST