Kantara: అంతర్జాతీయ భాషల్లోకి ‘కాంతార’

ABN , First Publish Date - 2023-03-19T20:53:31+05:30 IST

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). రిషబే దర్శకత్వం వహించారు. రూ.16కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Kantara: అంతర్జాతీయ భాషల్లోకి ‘కాంతార’

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). రిషబే దర్శకత్వం వహించారు. రూ.16కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా అంతర్జాతీయ భాషల్లోకి త్వరలోనే డబ్ కానుంది.

ఇండియాలో భారీ విజయం సాధించడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ‘కాంతార’ కు మంచి డిమాండ్ ఏర్పడింది. అందువల్ల మేకర్స్ ఈ సినిమాను ఇటలీ, స్పానిష్ భాషల్లోకి డబ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘అంతర్జాతీయ ప్రేక్షకులు ఈ సినిమాను తమ భాషల్లోకి డబ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘కాంతార’ ను త్వరలోనే ఇటలీయన్, స్పానిష్ భాషల్లోకి అనువదించనున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేం సంతోషిస్తున్నాం’’ అని రిషబ్ శెట్టి ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీని జెనీవాలోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రిషబ్‌ శెట్టి హాజరయ్యి మాట్లాడారు. ‘కాంతార’ లో సప్తమి గౌడ్ హీరోయిన్‌గా నటించారు. కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

‘కాంతార’ సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాకు రెండో భాగాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. రెండో భాగం.. సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని మేకర్స్ తెలిపారు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు. కాంతార ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపించనున్నారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరం. అందువల్లే మూవీ షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-03-19T20:53:37+05:30 IST