Rashmika Mandanna: మొదటి సినిమా అవకాశం గురించి చెప్పిన రష్మిక

ABN , First Publish Date - 2023-03-22T13:30:36+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ‘కిరీక్ పార్టీ’ (Kirik Party) కన్నడ సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది.

Rashmika Mandanna: మొదటి సినిమా అవకాశం గురించి చెప్పిన రష్మిక

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ‘కిరీక్ పార్టీ’ (Kirik Party) కన్నడ సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో సాన్వీ జోసెఫ్ పాత్రలో నటించింది. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో ఆమె నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ ప్రాజెక్టులో అవకాశం ఏ విధంగా వచ్చిందో రష్మిక మందన్నా తాజాగా చెప్పింది.

‘‘నటిగా నన్ను నేను ఎప్పుడు ఊహించకోలేదు. సినీ ఇండస్ట్రీలో రాణించగలనని ఎప్పుడు అనుకోలేదు. కానీ, సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని పాత్రలకు కూడా ఆడిషన్ ఇచ్చాను. అవకాశం మాత్రం రాలేదు. చిత్రాలు నా భవిష్యత్ కాదని అనుకున్నాను. అటువంటి సమయంలో ‘ఫ్రెష్ ఫేస్-2014’ టైటిల్ గెలుచుకున్నాను. ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై నా చిత్రం ప్రచురితమైంది. పరమ్‌వా స్టూడియోస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సాన్వీ జోసెఫ్ పాత్రకు ఆడిషన్ ఇవ్వమని ‘కిరీక్ పార్టీ’ బృందం నన్ను అడిగింది. ఆ విధంగా నాకు మొదటి సినిమా అవకాశం వచ్చింది’’ అని రష్మిక మందన్నా తెలిపింది.

‘కిరీక్ పార్టీ’ లో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వం వహించాడు. రక్షిత్ సొంత నిర్మాణ సంస్థ పరమ్‌వా స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక, రక్షిత్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఏమైందో తెలియదు కానీ అనంతరం వీరు విడిపోయారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-03-22T13:32:46+05:30 IST