Kichcha Sudeep: బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం.. కన్నడ స్టార్ హీరోకి బెదిరింపులు

ABN , First Publish Date - 2023-04-05T12:58:46+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అతికొద్దిమంది నటుల్లో శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ఒకరు.

Kichcha Sudeep: బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం.. కన్నడ స్టార్ హీరోకి బెదిరింపులు
Kichcha Sudeep political Entry

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అతికొద్దిమంది నటుల్లో శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) ఒకరు. అయితే.. ఈ నటుడు పాలిటిక్స్‌లోకి వెళ్లనున్నట్లు గత కొంతకాలంగా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మే 10 న కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్నాయి. అలాగే.. మే 13న వాటి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ తరుణంలోనే బుధవారం (మార్చి 5న) బీజేపీ (BJP)లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కిచ్చా సుదీప్‌కి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపులు ఎదురయ్యారు.

సుదీప్ మేనేజర్ జాక్ మంజు (Jack Manju)కి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఓ లెటర్ అందింది. అందులో సుదీప్‌కి సంబంధించిన ప్రైవేట్ వీడియోని బయటపెడతామంటూ బెదిరించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. దీనిపై మంజు పుట్టనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. దీంతో.. ఐపీసీ సెక్షన్లు 504, 506, 120 (బి) కింద పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే.. ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB)కి అప్పగించాలని సీనియర్ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. (Kichcha Sudeep receives threatening letter)

Sudeep.jpg

అయితే.. తాజాగా ఈ ప్రచారంపై సుదీప్ స్పందిస్తూ.. తను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావట్లేదని, కేవలం బీజేపీ తరుఫున ఎలక్షణ్ క్యాంపెయినింగ్ మాత్రమే చేస్తానని తెలిపాడు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నెలలో కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌తో కిచ్చా సుదీప్ సమావేశమయ్యాడు. అనంతరం సుదీప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను డీకే శివకుమార్, సీఎం బసవరాజ్ బొమ్మై, డీకే శివకుమార్‌ని కలిశాను. నాకు అందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే.. నేను రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే వెంటనే పబ్లిక్‌గా చెబుతాను’ అని తెలిపాడు. (Kichcha Sudeep's private video)

Kichcha-Sudeep-1.jpg

సుదీప్ ఇంకా మాట్లాడుతూ.. ‘రాజకీయ పార్టీల కంటే, నేను రాజకీయాల్లోకి రావడం గురించి నా అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అది నాకు చాలా ముఖ్యమైన విషయం. నేను వారిని కూడా సంప్రదించాలి. రాజకీయాల్లోకి రాకుండా సేవ చేయవచ్చు. అందుకే ముందుగా రాజకీయాల్లోకి వస్తే ఏం ఉపయోగమో, నాకు నేను తెలుసుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే సుదీప్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రచారం మొదలైంది.

ఇవి కూడా చదవండి:

Shilpa Shetty: పబ్లిక్‌లో హాలీవుడ్ నటుడితో ముద్దు.. 15 ఏళ్ల క్రితం కేసులో నటికి రిలీఫ్

Oscars95: ఏకంగా ఏనుగులని ఆస్కార్‌కి తీసుకుని వెళ్దామనుకున్నారంట.. కానీ..

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-05T13:41:23+05:30 IST