Oscars95: ఏకంగా ఏనుగులని ఆస్కార్‌కి తీసుకుని వెళ్దామనుకున్నారంట.. కానీ..

ABN , First Publish Date - 2023-04-04T17:24:42+05:30 IST

సినీ ప్రపంచంలో మొత్తం ఆస్కార్స్‌ (Oscars95)కి ఉన్న విలువ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినీ తారలు ఆ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.

Oscars95: ఏకంగా ఏనుగులని ఆస్కార్‌కి తీసుకుని వెళ్దామనుకున్నారంట.. కానీ..
The Elephant Whisperers

సినీ ప్రపంచంలో మొత్తం ఆస్కార్స్‌ (Oscars95)కి ఉన్న విలువ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినీ తారలు ఆ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. అలాంటిది ఈ ఏడాది మన దేశానికి రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అందులో.. ఒకటి ‘ఉత్తమ ఓరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ పాటకి రాగా.. ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్’ (Best Documentary Short) విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) రెండోది అందుకుంది. ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ గునీత్ మెంగా (Guneet Monga) నిర్మాత వ్యవహరించగా.. కార్తికి గోన్సాల్వేస్ (Kartiki Gonsalves) దర్శకత్వం వహించింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గునీత్ ఆస్కార్స్‌కి ఏనుగులను తీసుకెళ్లాలని అనుకున్నట్లు తెలిపింది.

ఆ ఇంటర్వ్యూలో గునీత్ మాట్లాడుతూ.. ‘నేను బొమ్మన్ (Bomman), బెల్లీ(Bellie)‌తో పాటు రఘు(Raghu), అమ్ము(Ammu)కు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను. అందుకే వారిని షాంపైన్ కార్పెట్‌తోపాటు ఆస్కార్‌కు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. నిజానికి చాలాసార్లు మా స్టెలిస్ట్‌లతో రఘుకి టక్స్, అమ్ముకు గౌన్ రెడీ చేయడం గురించి మాట్లాడేవాళ్లం. అనంతరం ఆస్కార్స్‌కి షార్ట్‌ లిస్ట్ అయిన తర్వాత ఏనుగులను కూడా తీసుకెళ్లడానికి వాటిని సిద్ధం చేయమని కూడా చెప్పాం ’ అని చెప్పుకొచ్చింది.

Guneet-monga.jpg

అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ ప్రొడక్షన్ చిత్రంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్స్‌లో చరిత్ర సృష్టించింది. దర్శకురాలు కార్తికీ గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా వేదికపై మహామహుల చప్పట్ల మధ్య ఈ అవార్డును అందుకున్నారు. అయితే.. అవార్డు గెలుచుకున్న ప్రతి ఒక్కరికీ ఆస్కార్ యాజమాన్యం స్టేజ్‌ మీద మాట్లాడేందుకు 45 సెకన్ల పాటు సమయం ఇస్తుంది. కాని, గునీత్ మెంగా మాట్లాడేందుకు అంత సమయంలో ఇవ్వకుండా మధ్యలో మ్యూజిక్ ప్లే చేశారు. అదే వారిని కొంత బాధించింది. దాంతో.. ఆమెకి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేదని అమెరికా మీడియా కూడా ఆస్కార్ యాజమాన్యాన్ని విమర్శించింది. (tux for Raghu, gown for Ammu)

కాగా.. గిరిజన జంట బొమ్మన్, బెల్లీ గాయపడిని ఏనుగు పిల్లను పెంచుతుంటారు. ఈ తరుణంలోనే వారికి రఘు, అమ్ము అనే ఏనుగులతో మంచి బంధం ఏర్పడుతుంది. అది ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ కథాంశం. ఐదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ అయ్యి ప్రశంసలు అందుకుంది. ఇదే ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి:

RRR in Japan: ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి పోస్ట్.. అందులోనూ జక్కన్న మార్క్ చూపించాడుగా..

Salman Khan: బాలీవుడ్ స్టార్ మూవీలో అతిథి పాత్రలో రామ్‌చరణ్!?.. ‘ఏంటమ్మా’ అంటూ..

Balagam: అసాంఘిక శక్తుల వల్ల మాకు నష్టం వస్తోంది.. దిల్‌రాజు కంప్లైంట్

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

Updated Date - 2023-04-04T17:58:12+05:30 IST