Rudramambapuram: హాట్ స్టార్‌లో ట్రెండింగ్.. మంత్రి తలసాని ప్రశంసలు

ABN , First Publish Date - 2023-07-18T15:56:08+05:30 IST

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో విడుదలై టాప్‌లో ట్రెండ్ అవుతోన్న ‘రుద్రమాంబపురం’ సినిమాపై తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. మత్స్యకారులపై ఈ సినిమాని చాలా బాగా తీశారని చెబుతూ. . చిత్రయూనిట్‌ని అభినందించారు.

Rudramambapuram: హాట్ స్టార్‌లో ట్రెండింగ్.. మంత్రి తలసాని ప్రశంసలు

ఎన్‌వీఎల్ (NVL) ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం ‘రుద్రమాంబపురం’. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్. శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, ప్రమీల, రజిని, శ్రీకళ, రత్నశ్రీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. మూల‌వాసుల క‌థ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం హాట్ స్టార్‌లో వస్తున్న స్పందనతో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమాపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు కురిపించారు.


ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రుద్రమాంబపురం సినిమా మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద చాలా చక్కగా తీశారు. సినిమా చాలా బాగుంది. ఇంత మంచి సినిమాను తీసిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ.. మా రుద్రమాంబపురం సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు. ప్రస్తుతం సినిమా హాట్ స్టార్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. థియేటర్స్‌లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉంది. తలసాని గారికి ఈ సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీపడి నటించారు. రుద్రమాంబపురం సినిమాకు రివ్యూ‌స్ కూడా బాగున్నాయి. త్వరలో మా NVL బ్యానర్ నుండి మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

Updated Date - 2023-07-18T15:56:08+05:30 IST