Sreeleela: ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ లీల కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2023-04-07T21:04:31+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటి శ్రీ లీల (Sreeleela). ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Sreeleela: ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ లీల కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటి శ్రీ లీల (Sreeleela). ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆమె నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ (I Love You Idiot). విరాట్ హీరోగా నటించారు. ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వేదిక సిద్ధమైంది.

‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ ఆహా‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 7 నుంచి ప్రేక్షకులను అందుబాటులో ఉంది. ఈ సినిమాకు ఏపీ అర్జున్‌ దర్శకత్వం వహించారు. అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీమతి బత్తుల వసంత సమర్పించారు. సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఏపీ అర్జున్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.

Sree.jpg

శ్రీ లీల చివరగా ‘ధమాకా’ (Dhamaka) లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపుగా రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. మహేశ్ బాబు, పంజా వైష్ణవ్ తేజ్, నితిన్, నవీన్ పోలిశెట్టి, బాలకృష్ణలతో సినిమాలు చేస్తుంది. మహేశ్ బాబు సినిమాలో ఆమె రోల్ ‘ధమాకా’ కు రెండింతలు ఉంటుందట. ‘ఎన్‌బీకే108’ (NBK108) లో బాలకృష్ణ కూతురి పాత్రను పోషిస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-07T21:06:26+05:30 IST