Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2023-10-10T11:44:46+05:30 IST

ఈ దసరాకి హీరోయిన్ ప్రియమణి నటించిన ఓ పవర్‌ఫుల్ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించారు. అక్టోబర్ 20న ఆహా ఓటీటీలో విడుదల కానుంది. పది ఎసిసోడ్‌లు ఉండనున్నాయి. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరిగితే.. మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశ శక్తి పీఠాల మహత్యం చెప్పేలా ఈ వెబ్ సిరీస్ ఉండనుంది.

Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Sarvam Shaktimayam Web Series Still

ఈ దసరాకి హీరోయిన్ ప్రియమణి (Priyamani) నటించిన ఓ పవర్‌ఫుల్ వెబ్ సిరీస్ (Web Series) విడుదల కాబోతోంది. ప్రియమణి, సంజయ్ సూరి (Sanjay Suri) మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ (Sarvam Shaktimayam) అనే వెబ్ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి (Pradeep Maddali) తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కు బివిఎస్ రవి (BVS Ravi) కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించారు. హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని ఈ వెబ్ సిరీస్‌ను సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా కథ సాగుతుంది. (Sarvam Shaktimayam Storyline)


Priyamani-Pic.jpg

ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉండనున్నాయి. ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుంది. మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశ శక్తి పీఠాల మహత్యం చెప్పేలా వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ ద్వారా మొత్తం భారతదేశంలోని 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ దసరాకు ‘సర్వం శక్తి మయం’ అనే ఈ వెబ్ సిరీస్‌ (Aha Web Series) ఓటీటీలోనూ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రియమణి, సంజయ్ సూరిలతో పాటుగా.. సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Raghava Lawrence: ఆడియో ఫంక్షన్లకు అభిమానులు రావొద్దు.. లారెన్స్ సంచలన వ్యాఖ్యలు

*******************************

*Lokesh Kanagaraj: ఆ డైలాగ్‌ వివాదానికి పూర్తి బాధ్యత నాదే!

*******************************

*Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?

******************************

*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..

************************************

*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!

**********************************

Updated Date - 2023-10-10T11:47:00+05:30 IST