OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-03-17T08:09:30+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. మార్చి 15న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

కుత్తే (Kuttey)

కోట్ల నగదుతో వెళ్తున్న వ్యాన్ వెళుతూ ఉంటుంది. ముంబై శివార్లలో రాత్రి వర్షం పడుతుండగా.. మూడు వేరు వేరు గ్యాంగ్స్ ఆ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తాయి. దీంతో ఆ మూడు గ్యాంగ్స్ మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడిపోయారు అనేది కుత్తే కథాశం. ఈ హిందీ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య రాయ్ కపూర్, టబు, కొంకణ్ సేన్ శర్మ, నసిరుద్దీన్ షా ముఖ్య పాత్రల్లో నటించారు.

kuttey.jpg

ది వేల్ (The Whale)

డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వం వహించిన 2022 అమెరికన్ సైకలాజికల్ డ్రామా చిత్రం 'ది వేల్'. 2012లో శామ్యూల్ డి. హంటర్ రచించిన నాటకం ది వేల్ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో బ్రెండన్ ఫ్రేజర్, సాడీ సింక్, హాంగ్ చౌ, టై సింప్‌కిన్స్, సమంతా మోర్టన్ నటించారు. ఓ ఇంగ్లిష్ టీచర్ ఉబకాయంతో బాధ పడుతుంటాడు. అందుకే తన గదిలోనే ఉంది అతిగా తింటూ చనిపోవాలని అనుకుంటాడు. అయితే చివరిసారిగా తన టీనేజ్ కూతురుతో మంచి రిలేషన్ కోసం ప్రయత్నిస్తాడు. ఈ తరుణంలో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

the-whale.jpg

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

Congratulations - గుజరాతీ

Class of '07 - ఇంగ్లిష్

Qodrat - ఇండోనేషియన్

నెట్ ఫ్లిక్స్ (Netflix)

Shadow and Bone Season 2 - ఇంగ్లిష్

Still Time - ఇటాలియన్

సోనీ లీవ్ (Sony LIV)

Rocket boys Season 2 - హిందీ

బుక్ మై షో (Book My Show)

5000 Blankets - ఇంగ్లిష్

ఇవి కూడా చదవండి:

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-17T08:09:35+05:30 IST