Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-06-05T21:08:04+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుపుతూ.. ఓ భారీ సెట్‌ను ఈ షెడ్యూల్ కోసం రెడీ చేస్తున్నట్లుగా మేకర్స్ ఓ వీడియోని వదిలారు.

Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ కోసం భారీగా.. ‘సెట్’ చేస్తున్నారు
Ustaad Bhagat Singh Still

‘గబ్బర్ సింగ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న రెండో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి (Anand Sai) పర్యవేక్షణలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను (Massive Set) నిర్మిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు సినిమాలోని ఇతర ప్రముఖ తారాగణం మొత్తం పాల్గొంటారని తాజాగా చిత్రయూనిట్ వెల్లడించింది.

Anand-Sai-1.jpg

ఇక ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటోన్న సెట్‌కు సంబంధించిన ఓ వీడియోని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ కోసం మేకర్స్, ఆయన మిత్రుడు ఆనంద్ సాయి భారీగానే ‘సెట్’ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మొదటి ఫస్ట్ గ్లింప్స్ అద్భుతమైన స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోలీస్ ఆఫీసర్‌గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌లో కనిపించడంతో మెగాభిమానులంతా ఖుష్ అయ్యారు. (Ustaad Bhagat Singh Update)

Anand-Sai-2.jpg

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ, టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అశుతోష్ రానా, నవాబ్ షా, కెజిఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు ‘జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి సంగీతం సమకూరస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం ప్రకటించనుంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

*Actor Prabhu: నాన్నకు తొలి వీరాభిమాని ఆయనే..

*Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది

*Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?

*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం

Updated Date - 2023-06-05T21:08:04+05:30 IST