Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

ABN , First Publish Date - 2023-06-05T20:14:41+05:30 IST

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అనేలా డేట్ ప్రకటించారు కానీ.. ఆ డేట్‌కి రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా జూన్ 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

Akhil Agent: ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
Agent Movie Still

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమా.. మొదటి రోజు మొదటి ఆటకే నెగిటివ్ టాక్‌కి గురికావడంతో.. మేకర్స్ ఆ సాహసం చేయలేదు. కేవలం వారం రోజులు కూడా థియేటర్లలో సందడి చేయలేకపోయిన ఈ చిత్రాన్ని.. నెల రోజులకు ముందే ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఓటీటీలో విడుదల తేదీని కూడా ప్రకటించారు.. కానీ చెప్పిన డేట్‌కి.. ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. అందుకు కారణం ఏమిటనేది ఇప్పటి వరకు అధికారికంగా అయితే బయటికి రాలేదు కానీ.. ఫైనల్‌గా ఈ చిత్రాన్ని జూన్ 23న స్ట్రీమింగ్‌కి సిద్ధం చేస్తున్నట్లుగా అయితే తాజాగా టాక్ బయటికి వచ్చింది.

అయితే అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాకపోవడానికి, డేట్ ప్రకటించి కూడా ఆగిపోవడానికి ఓ భారీ కారణమే ఉన్నట్లుగా కొన్ని గాసిప్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. మే 20వ తేదీన సోనీ లివ్‌ (SonyLIV)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. సోనీ లివ్ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌కు అన్నీ రెడీ చేసుకుంటున్న టైమ్‌లో.. దర్శకుడు సురేందర్ రెడ్డి కలగజేసుకుని కొన్ని అక్కరలేని సీన్లను తీసేసి సరికొత్తగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు పూనుకున్నట్లుగా టాక్ అయితే బాగా నడుస్తోంది.

AGENT.jpg

థియేటర్స్‌లో విడుదలైన సినిమా కాకుండా.. ఓటీటీలో సరికొత్తగా ఈ సినిమా ఉండబోతుందని.. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనేలా ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రకటించిన డేట్‌కి ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ రూమర్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. మరి ఇలాంటి రూమర్ల నేపథ్యంలో ఈసారైనా ఈ ‘ఏజెంట్’ (Agent OTT Release) వినిపిస్తున్న టైమ్‌కి ఓటీటీలోకి వస్తాడా? అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Actor Prabhu: నాన్నకు తొలి వీరాభిమాని ఆయనే..

*Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది

*Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?

*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం

Updated Date - 2023-06-05T20:14:41+05:30 IST