Mahi V Raghav: ఈ విజయం మేము ఊహించలేదు.. త్వరలోనే పార్ట్ 2

ABN , First Publish Date - 2023-06-24T15:50:45+05:30 IST

‘యాత్ర’‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్.. తాజాగా ఓటీటీ కోసం తెరకెక్కించిన రెండు వెబ్ సిరీస్‌లో సక్సెస్ కావడంతో.. ఆయన తన టీమ్‌తో కలిసి హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. త్వరలోనే ఈ రెండు వెబ్ సిరీస్‌లకు సీక్వెల్‌ ఉంటుందని మహి వి రాఘవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘సిద్ధా.. లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు.

Mahi V Raghav: ఈ విజయం మేము ఊహించలేదు.. త్వరలోనే పార్ట్ 2
Mahi V Raghav and Team

‘యాత్ర’‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ్ (Mahi V Raghav).. తాజాగా ‘సైతాన్’ అనే క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. వెన్నులో వణుకు పుట్టించే అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదలై సంచలన విజయం సాధించడంతో.. చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ... సైతాన్ వెబ్ సీరీస్ (Web Series).. అంతకు ముందు నేను తెరకెక్కించిన ‘సేవ్ ది టైగర్స్’ (Save The Tigers) కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రశంశలు లభిస్తున్నాయి. త్వరలో ‘సేవ్ ద టైగర్స్’కు, అలాగే ‘సైతాన్’కు కొనసాగింపు ఉంటుంది. ప్రస్తుతం నేను చేస్తున్న ‘సిద్ధా.. లోకం ఎలా ఉంది నాయనా?’ (Siddha Lokam Yela Undi Nayanaa?) విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

Mahi-V-Raghav.jpg

సైతాన్ సిరీస్‌లో నాకు సావిత్రి (Savitri) పాత్రను ఇచ్చిన దర్శకుడు మహి గారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సిరీస్ ద్వారా ప్రూవ్ అయ్యింది. భవిషత్తులో మరిన్ని మంచి రోల్స్‌లో మీ ముందుకు వస్తానని అన్నారు నటి సెల్లి (Selli). నటుడు రిషి (Rishi) మాట్లాడుతూ.. ఇందులో బాలి అనే రోల్‌లో నాకు నటించడానికి స్కోప్ ఉంది, అదే విధంగా ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకులు. అందరూ బాగా నటించారు, టెక్నికల్‌గా కూడా సిరీస్ బాగుందని అందరూ అంటున్నారు. సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌లో నటించాననే సంతృప్తి ఉందని తెలపగా.. నటి దేవియాని (Deviyani) మాట్లాడుతూ.. సేవ్ ద టైగర్స్ తర్వాత ఈ సిరీస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రెండు సిరీస్‌లకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. నా రోల్స్ రెండు సిరీస్‌లలో డిఫరెంట్‌గా ఉన్నాయని రివ్యూస్‌లో చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్


**************************************

*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

Updated Date - 2023-06-24T15:50:45+05:30 IST