OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-19T08:22:05+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల జోరు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో పలు సినిమాలు థియేటర్స్‌లో కాకుండా..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల జోరు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో పలు సినిమాలు థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ వినోదాన్ని పంచుతున్నాయి. పలువురు సినీ ప్రేక్షకులు సైతం థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు ఓటీటీలోకి వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో మార్చి 18న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ (Boyfriend for Hire)

అర్జున్ అనే యువకుడికి చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటేనే పడదు. చాలాసార్లు వాళ్ల వల్ల ఇబ్బందులు పడతాడు. అందుకే ఇంకెప్పుడు వాళ్లని దగ్గరికి రానివ్వకూడదు అనుకుంటాడు. కాని తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయాలనుకుంటారు. దాంతో తనకి నచ్చిన అమ్మాయిని వెతికే ప్రాసెస్ లో 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' గా మారతాడు. ఆ సమయంలోనే దివ్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిస్థితుల సమాహారమే బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ కథాంశం. విశ్వంత్ దుద్దుంపుడి, మాలవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

boufriend.jpg

పాప్‌కార్న్ (PopCorn)

సమీరనా, పవన్ అనే అపరిచితులైన అమ్మాయి, అబ్బాయికి అనుకోకుండా పరిచయం అవుతుంది. మొదటి పరిచయంలోనే వారిద్దరికీ గొడవ అవుతుంది. కానీ కొద్దిసేపటికి ఇద్దరు ఓ లిఫ్టులో ఇరుక్కుపోతారు. దాదాపు 18 గంటలు అక్కడే ఉండిపోతారు. దీంతో ఒకరిపై ఒకరికి కోపం తగ్గి ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది 'పాప్ కార్న్' కథాంశం. అవిక గోర్, సాయి రోనక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తెలుగు మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Popcorn.jpg

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar)

Bono & The Edge: A Sort of Homecoming with Dave Letterman - ఇంగ్లిష్

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Dance 100 - ఇంగ్లిష్

Chaguo - ఇంగ్లిష్

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

Gilbistic Family - తెలుగు

Knock at the Cabin - ఇంగ్లిష్

The Trade - ఇంగ్లిష్

ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX player)

Sweet sweet - మాండరిన్

జేమ్ ప్లెక్స్ (Gem Plex)

Halfpace - కన్నడ

ఇవి కూడా చదవండి:

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-19T08:22:11+05:30 IST