LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..

ABN , First Publish Date - 2023-05-28T12:53:10+05:30 IST

ఎన్టీఆర్‌, దర్శకుడు బి.విఠలాచార్యలది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. తన చిత్రాలతో ఎన్టీఆర్‌ను మాస్‌కి మరింత దగ్గర చేశారు ఈ జానపద బ్రహ్మ. వీరిద్దరి కలయికలో వచ్చిన జానపద చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రిహార్సల్ లేకుండా ఎన్టీఆర్ డైరెక్ట్‌గా టేక్‌లో పాల్గొన్నారు. అది ఫైట్ సీన్. ఆ సన్నివేశంలో కత్తి ఎన్టీఆర్ తలకి తగిలేది. ఎన్టీఆర్ తప్పించుకుని చేయి అడ్డు పెట్టడంతో.. చేతికి గాయమైంది. అయినా ఎన్టీఆర్ షూటింగ్ అపలేదు.

LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..
Lakshmi Kataksham Movie Scene

ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు బి.విఠలాచార్య (B. Vittalacharya)లది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. తన చిత్రాలతో ఎన్టీఆర్‌ను మాస్‌కి మరింత దగ్గర చేశారు ఈ జానపద బ్రహ్మ. వీరిద్దరి కలయికలో వచ్చిన జానపద చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’ (Lakshmi Kataksham)లో రాజశ్రీ (Rajasri), కె.ఆర్‌.విజయ (KR Vijaya) హీరోయిన్లుగా నటించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌కు నమ్మిన బంటులా జగ్గారావు (Jagga Rao) ఎప్పుడూ వెంటే ఉండేవారు. తన సినిమాల్లో ఏదో ఒక వేషం జగ్గారావుకు ఇప్పించేవారు ఎన్టీఆర్‌. అలా ‘లక్ష్మీకటాక్షం’ చిత్రంలో కూడా రాజశ్రీ మేనమామగా చిన్న సైజు విలన్‌ పాత్ర పోషించే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రాజశ్రీ బొప్పాయి తోటలో డాన్స్‌ చేస్తూ పాట పాడుతుంటారు. అది చూసి సహించలేక కత్తితో ఎన్టీఆర్‌ మీదకు దాడి చేస్తారు జగ్గారావు. ఇందుకోసం పదునైన కత్తి సిద్ధం చేశారు. వాహినీ స్టూడియోలో వేసిన సెట్‌లో ఆ రోజు షూటింగ్‌ జరుగుతోంది. అప్పటికి సాయంత్రం ఐదున్నర కావడంతో షూటింగ్‌ త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్లే మూడ్‌లో ఉన్నారు ఎన్టీఆర్‌ (NTR).

అయితే.. కత్తితో జగ్గారావు దాడి చేయగానే ఆయన తప్పించుకుని ఇవతలకు వస్తారు. అప్పుడు ఆ కత్తి దెబ్బకి బొప్పాయి చెట్టు తెగి కింద పడుతుంది. ఇదీ షాట్‌. దర్శకుడు విఠలాచార్య వివరించగానే రిహార్సల్‌ చేయకుండా డైరెక్ట్‌ టేక్‌ చేద్దామని రామారావు అన్నారు. సరేనన్నారు విఠలాచార్య. కానీ జగ్గారావు గుండెల్లో దడ మొదలైంది. అసలే ఫైట్‌ సీన్‌. పైగా చేతిలో పదునైన కత్తి . అందుకే కనీసం ఒకసారన్నా రిహార్సల్‌ చేస్తే బాగుంటుదని జగ్గారావుకు అనిపించింది. కానీ ఎన్టీఆర్‌ డైరెక్ట్‌ టేక్‌ చేద్దామనేసరికి వద్దు అని చెప్పే ధైర్యం ఆయనకి ఎక్కడుంటుంది? అందుకే దేవుడి మీద భారం వేసి షాట్‌లో పాల్గొన్నారు జగ్గారావు. (Shocing Incident at Lakshmi Kataksham Shooting)

NTR-Lakshmi-kataksham.jpg

కెమెరా ఆన్‌ అయింది. కత్తితో ఎన్టీఆర్‌ మీదకు దాడి చేశారు జగ్గారావు. కానీ చేతులు వణుకుతుండడంతో ఆ కత్తి దెబ్బ ఎన్టీఆర్‌ తలకి తగలబోయింది (Injury to NTR). అది గ్రహించి చేతిని అడ్డు పెట్టారు ఎన్టీఆర్‌. కత్తి పదునుకు ఆయన చెయ్యి తెగింది. రక్తం కారుతున్న చేతిని అలాగే గట్టిగా పట్టుకుని ఇవతలకు వచ్చారు ఎన్టీఆర్‌. ఇది చూసి జగ్గారావు గజగజ వణికిపోయారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!

*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!

*Miss Shetty Mr Polishetty: నవీన్ పాడుతుంటే.. హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.. ఏంటి కథ?

*Sivaji Raja: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ.. అందులో మంచివారు కొందరే!

*Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది

*Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!

*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!

Updated Date - 2023-05-28T12:53:10+05:30 IST