Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!

ABN , First Publish Date - 2023-06-28T19:33:34+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితం శుభం సీన్‌కు చేరుకుందని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన ‘నెంబర్‌వన్’ చిత్రం మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. చిరంజీవి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’, నాగార్జున నటించిన ‘గోవిందా గోవిందా’ చిత్రాలను బీట్ చేసి సక్సెస్‌ఫుల్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నిలబడింది.

Number One: ఇక కృష్ణ పని అయిపోయిందనుకునే టైమ్‌లో.. చిరు, నాగ్‌లకు షాకిస్తూ..!
Super Star Krishna and Soundarya

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) సినీ జీవితం శుభం సీన్‌కు చేరుకుందని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైన ‘నెంబర్‌వన్’ (Number One) చిత్రం మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్ర విజయానికి ముఖ్య కారకుడు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి (SV Krishna Reddy). ఆయన కృష్ణ అభిమాని (Fan) కూడా. కృష్ణలోని మైనస్ పాయింట్లు కవర్ చేసి, ఆయనకు సరికొత్త ఇమేజ్ ఏర్పడే రీతిలో చిత్రాన్ని మలిచారాయన. అభిమానులు కృష్ణను ఎలా చూడాలనుకొంటున్నారో.. అలా వారి ఊహలకు రూపకల్పనగా ‘నెంబర్‌వన్’ చిత్రాన్ని రూపొందించారు కృష్ణారెడ్డి. కాస్ట్యూమ్స్, లుక్స్, స్టయిల్, యాక్టింగ్.. ఇలా అన్ని విషయాల్లో కుర్ర కృష్ణను చూపించారు. ఒక్కసారిగా వయసు తగ్గిపోయి పాతికేళ్ల యువకునిగా మారిపోయిన కృష్ణ (Krishna)ను తెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

హీరో కృష్ణ నటించిన గత చిత్రాలకు భిన్నంగా ‘నెంబర్‌వన్’ చిత్రాన్ని తీస్తానని ముందే ప్రకటించిన కృష్ణారెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. కృష్ణ ఒక సీన్‌లో వాడిన డ్రెస్ మరో సీన్‌లో వాడలేదంటే ఆయన లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఊహించుకోవచ్చు. కృష్ణను విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నీగ్రో గెటప్స్ వేయించారు కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి ‘నెంబర్‌వన్’ అని టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ నెంబర్ వన్ హీరోనా అని విమర్శించిన వారూ ఉన్నారు. కానీ సినిమా చూశాక ఎవరూ మాట్లాడలేదు.

Krishna-1.jpg

కృష్ణ సరసన సౌందర్య (Soundarya) తొలిసారిగా నటించారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)‌తో పాటు మహేశ్ ఆనంద్ (Mahesh Anand) కూడా విలన్‌గా నటించారు. శాడిస్ట్ విలన్ పాత్ర అది. ముఖ్యంగా మహేష్ ఆనంద్, బ్రహ్మానందంపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. 1994 సంక్రాంతి చిత్రాల్లో నెంబర్ వన్ విజేత‌గా నిలిచింది. ఈ సినిమాకు వారం రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ (Mugguru Monagallu), వారం తర్వాత కింగ్ నాగార్జున (King Nagarjuna) నటించిన ‘గోవిందా గోవిందా’ (Govinda Govinda) చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించడంతో ‘నెంబర్‌వన్’ సినిమా దూసుకుపోయింది.

-వినాయకరావు

ఇవి కూడా చదవండి:

**************************************

*Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు


**************************************

*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..


**************************************

*Varun Tej: ‘గాంఢీవధారి అర్జున’‌ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. ఆగస్ట్‌లో యుద్ధమే!


**************************************

*Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం


**************************************

*Naga Chaitanya: నిఖిల్ గురించి నాగచైతన్య ఏం చెప్పాడంటే..


**************************************

Updated Date - 2023-06-28T19:33:34+05:30 IST