VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..

ABN , First Publish Date - 2023-06-28T16:11:00+05:30 IST

బిగ్‌బాస్ ఫేమ్ విజె సన్నీ మంగళవారం ఓ వీడియో పోస్ట్ చేసి. బుధవారం కొత్త పార్టీ ప్రకటించబోతున్నానంటూ హడావుడి చేసిన విషయం తెలిసిందే. అంత లేదు అని అంతా అనుకున్నట్లుగానే.. ఇప్పుడా పార్టీ తన తదుపరి చిత్రానికి సంబంధించినదిగా మేకర్స్ రివీల్ చేశారు. విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న పార్టీ ‘సౌండ్ పార్టీ’ అని చెబుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.

VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..
VJ Sunny

అనుకున్నదే అయ్యింది.. బిగ్‌బాస్ ఫేమ్ విజె సన్నీ (VJ Sunny) మంగళవారం ఓ వీడియో పోస్ట్ చేసి. బుధవారం కొత్త పార్టీ ప్రకటించబోతున్నానంటూ హడావుడి చేసిన విషయం తెలిసిందే. అంత లేదు అని అంతా అనుకున్నట్లుగానే.. ఇప్పుడా పార్టీ తన తదుపరి చిత్రానికి సంబంధించినదిగా మేకర్స్ రివీల్ చేశారు. ఆయన నూతన పార్టీ పెట్టబోతున్నానంటూ హడావుడి చేసినప్పుడే అంతా అనుమానించారు. ఇదేదో సినిమా ప్రమోషన్ కోసమని ముందే అంతా ఊహించారు. కానీ ఏం పార్టీ అంటాడో చూద్దామని అనుకుంటున్న వారందరికీ.. ‘సౌండ్ పార్టీ’ అంటూ తాజాగా రివీల్ చేశాడు. ఓ ట్విస్ట్‌డ్ ఫ్యామిలీ స్టోరీతో ‘సౌండ్ పార్టీ’ ఇచ్చేందుకు సన్నీ సిద్ధమవుతున్నాడు.

VJ-Sunny.jpg

విజె సన్నీ తదుపరి చిత్రం పేరు ‘సౌండ్ పార్టీ’ (Sound Party). ఈ విషయం తెలియజేస్తూ మేకర్స్ ఓ అధికారిక పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో టైటిల్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. హాస్యభరిత చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. అందుకు తగ్గట్టే టైటిల్‌ని డిజైన్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌లో సంకెళ్లు, డబ్బు, దస్తావేజులు, పాప్ కార్న్.. ఇలా చాలా ఐటమ్స్‌ని కవర్ చేశారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ (Full Moon Media Productions) బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజె సన్నీ పక్కన హ్రితిక శ్రీనివాస్ (Hrithika Srinivas) హీరోయిన్‌గా నటిస్తోంది.

Sound-Party.jpg

నూతన పార్టీ అంటూ విజె సన్నీ విడుదల చేసిన వీడియోలో ఏముందంటే.. ‘‘నేను మీ అందరితో ఒక న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. నేను కూడా నా సొంత పార్టీని స్టార్ట్ చేయబోతున్నాను. బుధవారం మధ్నాహ్నం 2 గంటలకు నా పార్టీ అనౌన్స్‌మెంట్ జరగబోతోంది. మీ అందరికీ మరింత దగ్గరవడానికి ఒక ప్రయత్నంగా ఒక పార్టీని లాంఛ్ చేయబోతున్నాను. బుధవారం నా నూతన పార్టీ అనౌన్స్‌మెంట్.. మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ పోస్టర్‌తో సినిమా పబ్లిసిటీ కోసమే సన్నీ ఇదంతా చేసినట్లుగా తెలిసిపోయింది. (VJ Sunny New Party)

Sound.jpg

‘సౌండ్ పార్టీ’ సినిమా విషయానికి వస్తే.. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1‌గా.. వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జయశంకర్ సమర్పిస్తుండగా.. రైటర్ సంజయ్ శేరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హైదరాబాద్ సార‌థి స్టూడియోలో చిత్ర టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను జ‌ర్న‌లిస్ట్‌ల చేతుల మీదుగా మేకర్స్ ఆవిష్క‌రించారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం


**************************************

*Naga Chaitanya: నిఖిల్ గురించి నాగచైతన్య ఏం చెప్పాడంటే..


**************************************

*Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి


**************************************

*Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్

********************

Updated Date - 2023-06-28T18:35:10+05:30 IST