Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు

ABN , First Publish Date - 2023-06-28T18:00:25+05:30 IST

మేనమామ-మేనల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని గురువారం (జూన్ 29) సాయంత్రం 5గంటల 04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Bro: బ్రో వచ్చాడు.. డబ్బింగ్ చెప్పేశాడు.. టీజర్‌కి లైన్ క్లియర్ చేసేశాడు
Pawan Kalyan and Samuthirakani

మేనమామ-మేనల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (Bro). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై జీ స్టూడియోస్‌ (ZEE Studios)తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడా అంచనాలను డబుల్ చేసేలా.. ‘బ్రో’ టీజర్ (Bro Teaser) రాబోతోంది. బ్రో టీజర్‌ విడుదలకు సంబంధించిన డేట్ అండ్ టైమ్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Kalyan-1.jpg

వాస్తవానికి టీజర్ డేట్ ముందే వచ్చినప్పటికీ.. టీజర్‌కి ఇంకా పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెప్పలేదనే వార్తతో.. అందరిలోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. ఆ కన్ఫ్యూజన్‌ని తొలగిస్తూ.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. పవన్ కల్యాణ్ ఈ రోజు డబ్బింగ్ పూర్తి చేయడం విశేషం. జ్వరం కారణంగా ఆయన చేస్తున్న వారాహి యాత్రకు కూడా బ్రేకిచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినా సరే రెస్ట్ తీసుకోకుండా.. డబ్బింగ్ చెప్పేసి.. ‘బ్రో’ టీజర్ విడుదలకు పవన్ కల్యాణ్ లైన్ క్లియర్ చేశారు. పవన్ చెప్పాల్సిన డబ్బింగ్ కూడా పూర్తవడంతో.. టీజర్‌ని గురువారం (జూన్ 29) సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. (Bro Teaser Release Date and Time)

Kalyan-2.jpg

ఈ పోస్టర్‌లో చిటికె వేస్తున్నట్లుగా ఒక చేతిని చూపిస్తూ.. టీజర్‌కి సిద్ధమవ్వండి అనేలా మేకర్స్ సంకేతాన్నిచ్చారు. దీంతో టీజర్ వస్తుందా? రాదా? అనే అనుమానంలో ఉన్న ఫ్యాన్స్.. ‘వెయిటింగ్’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ఎస్.ఎస్. థమన్ (SS Thaman) సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*VJ Sunny: విజె సన్నీ పెడతానన్న, చెబుతానన్న న్యూ పార్టీ ఇదే..


**************************************

*Varun Tej: ‘గాంఢీవధారి అర్జున’‌ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. ఆగస్ట్‌లో యుద్ధమే!


**************************************

*Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం


**************************************

*Naga Chaitanya: నిఖిల్ గురించి నాగచైతన్య ఏం చెప్పాడంటే..


**************************************

*Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి


**************************************

Updated Date - 2023-06-28T18:00:25+05:30 IST