Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం

ABN , First Publish Date - 2023-06-28T13:44:08+05:30 IST

జూలై 7న విడుదల కాబోతోన్న ‘భాగ్ సాలే’ మూవీ చిత్రయూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర ట్రైలర్‌ని చూసిన ఆయన.. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరారు. హీరో శ్రీసింహా కోడూరి కీరవాణి కుమారుడనే విషయం.. తను హీరోగా పేరు తెచ్చుకునే వరకు తెలియదని అంటూ.. అతని స్టోరీ సెలక్షన్స్‌పై ప్రశంసలు కురిపించారు.

Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం
Mega Star Chiranjeevi with Bhaag Saale Team

శ్రీసింహా (Sri Simha Koduri) కీరవాణి‌ (MM Keeravani)గారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే వరకు నాకు తెలియదు.. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi). శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘భాగ్ సాలే’ (Bhaag Saale). నేహా సోలంకి (Neha Solanki) హీరోయిన్‌గా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి (Praneet Brahmandapalli) దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్‌తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న ‘భాగ్ సాలే’ విడుదలకు సిద్ధమవుతోన్న తరుణంలో.. ఈ చిత్ర టీమ్‌కు బెస్ట్ విశెష్ అందజేశారు మెగాస్టార్ చిరంజీవి.

Chiru-2.jpg

సినిమా ట్రైలర్ చూసిన అనంతరం చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. ‘‘భాగ్ సాలే సినిమా ట్రైలర్ చాలా బాగుంది. శ్రీసింహా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంటున్నాడు. కామెడీ, మాస్, ఎంటర్‌టైనింగ్‌తో పాటు క్రైమ్ అంశాలతో సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. శ్రీసింహా.. కీరవాణిగారి అబ్బాయి అని అతను హీరోగా పేరు తెచ్చుకునే వరకు నాకు తెలియదు. వారసుడిగా కాకుండా తను స్వతహాగా ఎదగాలని ప్రయత్నిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణిగారికి పేరు తెచ్చేంతగా గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.

Chiru-1.jpg

అలాగే కాలభైరవ (Kalabhairava) అంటే రామ్ చరణ్‌ (Ram Charan)కు చాలా ఇష్టం. శ్రీసింహా, కాలభైరవ.. ఇద్దరూ ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇకపైనా మంచి అవకాశాలతో తమ ప్రతిభను చాటుకోవాలి. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండంగా ఈ సినిమాను రూపొందించాడు. అలాగే నిర్మాత అర్జున్ దాస్యన్ మంచి ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Naga Chaitanya: నిఖిల్ గురించి నాగచైతన్య ఏం చెప్పాడంటే..


**************************************

*Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి


**************************************

*Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్

********************

*OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?


**************************************

*VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?


**************************************

Updated Date - 2023-06-28T13:44:08+05:30 IST