Varun Tej: ‘గాంఢీవధారి అర్జున’‌ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. ఆగస్ట్‌లో యుద్ధమే!

ABN , First Publish Date - 2023-06-28T15:16:50+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘ఏజెంట్’ మూవీ ఫేమ్ సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎంటైర్ షూటింగ్ పూర్తయినట్లుగా తెలుపుతూ తాజాగా ఓ మాసివ్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Varun Tej: ‘గాంఢీవధారి అర్జున’‌ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. ఆగస్ట్‌లో యుద్ధమే!
Mega Prince Varun Tej

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej). ఇప్పుడదే ఫంథాను కొనసాగిస్తూ.. మరోసారి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వరుణ్ తేజ్ సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ సినిమా ‘గాంఢీవధారి అర్జున’ (Gandheevadhari Arjuna). ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో వ‌రుణ్ తేజ్ ఇందులో ఆక‌ట్టుకోబోతున్నారు. ‘ఏజెంట్’ (Agent) ఫేమ్ సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఎంటైర్ షూటింగ్ పూర్తయినట్లుగా తెలుపుతూ ఓ మాసివ్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆగస్ట్ 25న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ జరుపుకుంది. ఎస్వీసీసీ (SVCC) ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు (BVSN Prasad and Bapineedu) ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

Varun-Tej.jpg

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో వ‌రుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని నిలుచుని ఉన్నారు. వ‌రుణ్‌తేజ్ (Varun Tej) ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపించనున్నారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 25 వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Chiranjeevi: అతనంటే చరణ్‌కి చాలా ఇష్టం


**************************************

*Naga Chaitanya: నిఖిల్ గురించి నాగచైతన్య ఏం చెప్పాడంటే..


**************************************

*Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి


**************************************

*Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్

********************

*OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?


**************************************

Updated Date - 2023-06-28T15:16:50+05:30 IST