Sekhar Kammula: శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ ఇదేనట..

ABN , First Publish Date - 2023-04-27T17:58:52+05:30 IST

నా దృష్టిలో సినిమా అనేది ఏంటంటే... సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా

Sekhar Kammula: శేఖర్ కమ్ముల సక్సెస్ సీక్రెట్ ఇదేనట..
Director Sekhar Kammula

సెన్నిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Director Sekhar Kammula) ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)లో సందడి చేశారు. తాజాగా జరిగిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యునికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఉస్మానియాలోని ఠాగూర్ ఆడిటోరియం విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది. ఈ వేడుకలో శేఖర్ కమ్ముల చిత్రాలతో ప్రత్యేక ఏవీని ఏర్పాటు చేశారు. దీనిని చూసిన అతిథులతోపాటు విద్యార్థులంతా ఫిదా అయిపోయారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన అనంతరం.. విద్యార్థులను ఉద్దేశించి శేఖర్ కమ్ముల (Director Sekhar Kammula Speech) మాట్లాడుతూ..

‘‘ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ (Hyderabad) అంటే బిర్యానీ, ఇరానీ చాయ్ మాత్రమే కాదు... గొప్ప ప్రేమకు నిలయం. ఈ విషయం నా సినిమా ద్వారా చెప్పాను. కానీ ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు కాబట్టి మరోసారి చెబుతున్నా. హైదరాబాద్‌ను చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే. కుల్ కుత్బుషా-భాగమతిల ప్రేమ చాలా అందంగా ఉండేది. మూసీ నది ఒడ్డున వారి ప్రేమ గొప్పగా సాగింది. వారి ప్రేమకు నిదర్శనంగా అప్పట్లో ప్యారనాఫూల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు మనం దాన్ని పురానాపూల్ బ్రిడ్జి అంటున్నాం.

Kammula.jpg

అలాగే వినిస్ట్రన్ చర్చిల్-ఫ్యాములా హైదరాబాద్ వీధుల్లో ఏనుగుపై తిరిగేవారట. కోఠి ఉమెన్స్ కళాశాల చుట్టూ ఓ గొప్ప ప్రేమ కథ ఉంది. ఇలా హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా దేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉంది. పీవీ నర్సింహారావు, నాగేశ్ శర్మ, శ్యామ్ బెనగల్, అజారుద్దీన్ ఇలా అనేక రంగాల్లో గొప్పవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు. హైదరాబాద్ అంటే అంత ప్రేమ మనకు. సినిమాలతో కూడా ఇక్కడ ప్రేమలో పడొచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి. మన ప్రాంతం, మన దేశం అని కాకుండా ప్రపంచమంతా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మనం లేకున్నా రేపు మన సినిమాలు బతికే ఉంటాయి. (Sekhar Kammula about Hyderabad)

Sekhar.jpg

నా దృష్టిలో సినిమా అనేది ఏంటంటే... సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా ఉండాలి. మంచిని ప్రొత్సహించేలా ఉండాలి. సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇదే విషయాన్ని నేను నా సినిమాల ద్వారా ప్రయత్నిస్తుంటాను. సినిమా అనేది యూనివర్శల్‌గా ఉండాలి (Sekhar Kammula about Movie Making). న్యూయార్క్‌లో భాష తెలియని వాడు కూడా చూస్తే అతనికి అర్థం కావాలి. సినిమాకు యూనివర్శల్ అప్పీల్ ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి. పాత పడకూడదు. అది చూశాక గర్వపడేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి. కానీ ఇది ఎలా సాధ్యమంటే... సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. అందుకే కిందిస్థాయి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్.. ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంపథితో చూడాలి. మనిషి-జంతువు వైపు ఆలోచిస్తే జంతువు తీసుకోవాలి. పురుషుడు-స్త్రీ అంటే స్త్రీ వైపు ఆలోచించాలి. మన ఈగోలను పక్కనపెట్టి ఎంపథితో వెళ్లాలి. ఐన్ స్ట్రీన్ కూడా గాంధీని గొప్ప మనిషిగా భావిస్తాడు. అదే దారిలో నేను సినిమాలు తీస్తాను. అందుకే చాలా మంది నా సినిమాలను ఇష్టపడతారు. విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే..’’ అని ఈ సెన్సిబుల్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..

*Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?

*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

*Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

Updated Date - 2023-04-27T18:03:33+05:30 IST