Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?

ABN , Publish Date - Dec 22 , 2023 | 05:00 PM

జెమిని టీవీలో మరో నూతన సీరియల్ ప్రసారానికి సిద్ధమవుతోంది. గతంలో జెమిని టీవీలో వచ్చిన ‘చి.ల.సౌ. స్రవంతి’ సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సీరియల్‌కు కొనసాగింపు అన్నట్లుగా.. ఇప్పుడు ‘స్రవంతి’ పేరుతో నూతన నటీనటులతో సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. డిసెంబర్ 25 నుండి ఈ సీరియల్ ప్రారంభం కానుంది.

Sravanthi: జెమిని టీవీలో సరికొత్త సీరియల్.. ఎప్పటి నుంచంటే?
Sravanthi Serial Stars

జెమిని టీవీ (Gemini)లో మరో నూతన సీరియల్ ప్రసారానికి సిద్ధమవుతోంది. గతంలో జెమిని టీవీలో వచ్చిన ‘చి.ల.సౌ. స్రవంతి’ (Chi La Sow Sravanthi) సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న రిషి అమెరికా నుండి ఇండియా వచ్చి స్రవంతికి తన ప్రేమతో దగ్గరై.. పెళ్లి చేసుకుని స్రవంతిని తన బందీగా తీసుకువెళ్తాడు.. ఇలా బందీ అయిన బంధం ఎలా కొనసాగుతుందనే కథాంశంతో నిర్మితమైన స్రవంతి సీరియల్‌లో భరణి, మీనా, నంద కిషోర్, నిఖిల్, మౌనిక, తదితరులు నటించారు. ఇప్పుడీ ‘చి.ల.సౌ. స్రవంతి’ సీరియల్ గురించి ఎందుకంటే.. ఇప్పుడు రాబోయే ‘స్రవంతి’ (Sravanthi) సీరియల్.. దానికి కొనసాగింపుగా ఉండబోతోందనేలా విడుదలైన ప్రోమోలు తెలియజేస్తున్నాయి.


అప్పటి సీరియల్‌లో నటించిన వారిని చూపిస్తూ.. ఈ ‘స్రవంతి’ సీరియల్‌ను ప్రమోట్ చేస్తుండటంతో.. ఆ సీరియల్‌కు కొనసాగింపుగా ఇది ఉంటుందనేలా అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు కూడా అదే తెలియజేస్తూ.. ఈ సీరియల్‌పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొత్తతరం నటీనటులతో, సరికొత్త కథాంశంతో డిసెంబర్ 25వ తేదీ, సోమవారం రాత్రి 9 గం.ల నుండి జెమిని టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘స్రవంతి’ సీరియల్.. ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుందని జెమిని టీవీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. (New Serial Sravanthi)


ఇవి కూడా చదవండి:

====================

*పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!

*********************************

*Jyothika: ముంబైకి మకాం అందుకే.. అసలు విషయం చెప్పేసిన జ్యోతిక

*******************************

*Devil: ‘డెవిల్’ సెన్సార్ టాక్ వచ్చేసింది..

*********************************

*Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..

********************************

Updated Date - Dec 22 , 2023 | 05:25 PM