Devil: ‘డెవిల్’ సెన్సార్ టాక్ వచ్చేసింది..

ABN , Publish Date - Dec 21 , 2023 | 07:28 PM

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనకంటూ ఓ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా రూపొందించారు. డిసెంబ‌ర్ 29న విడుదల కాబోతోన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

Devil: ‘డెవిల్’ సెన్సార్ టాక్ వచ్చేసింది..
Devil Movie Still

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనకంటూ ఓ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’ (Devil). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

రీసెంట్‌గా విడుదలైన ‘డెవిల్’ మూవీ ట్రైలర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ జోనర్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుందనే విషయాన్ని ట్రైలర్ తెలియజేసింది. ఇప్పుడీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యుబైఏ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. సెన్సార్ నుండి సినిమాపై పాజిటివ్ టాక్‌ రావటంతో.. యూనిట్ అంతా హ్యాపీగా ఉంది. (Devil Censor Completed)


Kalyan-ram.jpg

కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయి. దీంతో పాటు డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ని అలరించనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన లోకాన్ని క్రియేట్ చేశారు. దీనికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ ఓ రేంజ్‌లో మెప్పించనున్నాయి. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించారు. (Devil Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..

********************************

*ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం

********************************

*బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?

****************************

*Vijay Kiragandur: ‘కాంతార’కే కాదు.. ‘సలార్’ విషయంలోనూ అంతే!

******************************

Updated Date - Dec 21 , 2023 | 07:28 PM