Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..

ABN , Publish Date - Dec 21 , 2023 | 05:55 PM

హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ మూవీ 2024లో విడుదల కానున్న క్రేజీ, మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఈ చిత్రం 2024లో ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..
Ooru Peru Bhairavakona Movie Still

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ (VI Anand) రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). ఈ మూవీ 2024లో విడుదల కానున్న క్రేజీ, మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.

ఈ ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం 9 ఫిబ్రవరి, 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుంతోంది. రెండు నెలల్లో సినిమా రాబోతుంది కాబట్టి మేకర్స్ త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా ఈ సినిమాపై క్రేజ్ పెరగుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. (Ooru Peru Bhairavakona Movie Release Date)


Sundeep.jpg

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇందులో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వుండబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా ప్రిమైజ్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. (Ooru Peru Bhairavakona Movie)


ఇవి కూడా చదవండి:

====================

*ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం

********************************

*బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?

****************************

*Vijay Kiragandur: ‘కాంతార’కే కాదు.. ‘సలార్’ విషయంలోనూ అంతే!

******************************

Updated Date - Dec 21 , 2023 | 05:55 PM