పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!

ABN , Publish Date - Dec 22 , 2023 | 02:32 PM

టైటిల్ చూసి ఇదేదో ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానం గురించి అనుకుంటున్నారేమో! టాప్, జీరో అనగానే అంతా అదే అనుకుంటారు కానీ ఇది ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి సంబంధించిన మ్యాటర్ కాదు. 2023 సంవత్సరం పూర్తై.. 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో 2023లో స్టార్ హీరోల సినిమాల విషయంలో ఏం జరిగిందనేది ఒక్కసారి గమనిస్తే.. పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి, ప్రభాస్‌వి రెండు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగతా వారికి జీరో.

పవన్ 1, ప్రభాస్ 2.. ప్రభాసే ‘టాప్’, మిగతా స్టార్ హీరోలంతా ‘జీరో’!
Tollywood Star Heroes

టైటిల్ చూసి ఇదేదో ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానం (Tollywood Number 1 Hero) గురించి అనుకుంటున్నారేమో! టాప్, జీరో (Zero) అనగానే అంతా అదే అనుకుంటారు కానీ ఇది ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి సంబంధించిన మ్యాటర్ కాదు. అందులోనూ ఇప్పుడున్న స్టార్ హీరోలలో నెంబర్ వన్ స్థానం గురించి మాట్లాడుకునేంత మ్యాటర్ కూడా ఏమీ లేదు. ఎందుకంటే, ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానం గురించి మాట్లాడుకునే అవకాశం లేదు. ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే.. ఓ నలుగురైదుగురు హీరోలకి ఆ స్థానం ఇచ్చేయాలి. సరే ఈ స్థానం, స్థాయి సంగతి పక్కన పెట్టి.. టైటిల్‌లోని ‘టాప్, జీరో’ల విషయానికి వస్తే.. 2023 సంవత్సరం పూర్తై.. 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో 2023లో ఏం జరిగిందనేది (2023 Tollywood Rewind) ఒక్కసారి గమనిస్తే.. ఈ సంవత్సరం (2023) స్టార్ హీరోల సినిమాలు ఎన్ని విడుదలయ్యాయి. ఆ లిస్ట్‌లో టాప్ ఎవరు? అనే విషయం తెలుసుకుందాం..

Star-Heroes.jpg

2023 సంవత్సరంలో సుమారుగా 225 సినిమాలు టాలీవుడ్‌లో విడుదలైతే.. ఇందులో ఇప్పుడున్న స్టార్ హీరోలకు సంబంధించి ఒక్క పవన్, ప్రభాస్ మినహా.. మిగతా స్టార్ హీరోల సినిమా ఒక్కటి కూడా థియేటర్లలోకి రాలేదు. ఈ లిస్ట్‌లో సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీ సినిమాల సంగతి పక్కనపెడితే.. ప్రస్తుత జనరేషన్ స్టార్ హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన సినిమా 1 విడుదలైతే, ప్రభాస్ (Prabhas) నటించిన 2 సినిమాలు ఈ సంవత్సరం థియేటర్లలోకి వచ్చాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ నలుగురు స్టార్ హీరోల నుండి మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అంటే, ఈ సంవత్సరం ఈ హీరోల సినిమాల సంఖ్య ‘జీరో’ అన్నమాట.

Prabhas-adipurush.jpg

ఇక పవన్ 1, ప్రభాస్ 2 విషయానికి వస్తే.. 2023వ సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’ (Bro) అంటూ పలకరిస్తే.. ప్రభాస్ మాత్రం రెండు సినిమాలు.. ఒకటి ‘ఆదిపురుష్’ (Adipurush), రెండోది తాజాగా విడుదలైన ‘సలార్’ (Salaar) చిత్రాలతో.. ఈ సంవత్సరం రెండు సినిమాలు చేసిన స్టార్ హీరోగా టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, పాన్ ఇండియా (Pan India) సినిమాలుగా విడుదల కావడం మరో విశేషం. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. 2023లో రెండు సినిమాలు చేసిన స్టార్ హీరోగా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. 2023లో రెండు సినిమాలతో వచ్చిన ప్రభాస్, 2024లోనూ తన జోరు కొనసాగించేలా ప్లాన్ చేసుకోవడం విశేషం. 2024లోనూ ప్రభాస్ నుండి రెండు సినిమాలు (కల్కి, డైరెక్టర్ మారుతితో చేస్తున్న చిత్రం) కచ్చితంగా వచ్చేలా.. ఈ రెబల్ స్టార్ (Rebel Star) ప్లాన్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.


Pawan-Kalyan.jpg

వెయిట్ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 3 సినిమాలు

మరోవైపు పవన్ కళ్యాణ్ నుండి కూడా రెండు సినిమాలు వచ్చేవే కానీ.. పొలిటికల్‌గా బిజీ కావడంతో, ఆయన చేస్తున్న సినిమాలకు ప్రస్తుతం బ్రేక్స్ పడ్డాయి. ‘OG’ దాదాపు షూటింగ్ చివరి స్టేజ్‌కి చేరుకోగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరో సినిమా ‘హరిహర వీరమల్లు’ కూడా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం మళ్లీ ఈ సినిమాలు సెట్స్‌పై సందడి చేసే అవకాశం ఉంది.

Mahesh-Babu.jpg

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Mahesh Next Film Guntur Kaaram)

2022లో వచ్చిన ‘సర్కారి వారి పాట’ సినిమా తర్వాత.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రారంభమవడానికి చాలా టైమ్ తీసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)తో సినిమా అయితే ఓకే అయింది కానీ.. షూటింగ్ విషయంలోనే కన్ఫ్యూజ్ నెలకొంది. మొదట్లో కొంత మేర షూట్ చేసి.. అది బాగా రాలేదు అనుకుని.. మళ్లీ మొదటి నుండి షూట్ మొదలెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. మధ్యలో పలువురు సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో.. అసలీ ప్రాజెక్ట్ ఉంటుందా? అనేలా అనుమానాలు ఏర్పడ్డాయి. చివరికి అన్ని అడ్డంకులు దాటుకుని ‘గుంటూరు కారం’ రాబోయే సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేందుకు శరవేగంగా ముస్తాబవుతోంది. మరోవైపు, దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో మహేష్ బాబు ఓ సినిమా సైన్ చేసి ఉన్నారు. ఆ సినిమా 2024లో సెట్స్‌పైకి రానుంది. బహుశా ఈ సినిమా 2025లో విడుదల కావచ్చు.


RRR.jpg

ఆర్ఆర్ఆర్ (RRR) హీరోల అభిమానులకు నిరాశే..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంచలన విజయాన్ని అందుకుని, భారతదేశ సినీ కీర్తి ప్రతిష్టలను ఆస్కార్ స్థాయిలో చాటి చెప్పింది. అయితే ఈ సినిమాలో చేసిన హీరోల అభిమానులకు మాత్రం ఆ తర్వాత నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ సినిమా టైమ్‌లో తమిళ సంచలన దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Ram Charan Movie Game Changer) అనే సినిమాని మొదలెట్టాడు. షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. మధ్యలో శంకర్ (Director Shankar) వేరే సినిమాతో బిజీ కావడంతో.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ నత్తనడకన సాగుతూ వస్తుంది. ఇంత వరకు ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించలేదు. ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి ఇలా ఉంటే.. బుచ్చిబాబు సానా (Buchibabu Sana)తో చరణ్ మరో సినిమాకు కమిట్ అయ్యారు. అన్నీ కుదిరితే ఈ రెండు సినిమాలు 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివ (Koratala Siva)తో చేయాల్సిన ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) సినిమా ప్రారంభమవడానికి చాలా టైమ్ పట్టింది. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే.. ఒక్కసారి సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత మాత్రం.. బుల్లెట్ స్పీడ్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండటం విశేషం. ‘దేవర’ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం 5 ఏప్రిల్, 2024లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్ 2’ సినిమాలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 2024లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. 2023లో అభిమానులను నిరాశ పరిచిన ఈ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) హీరోలు.. 2024లో మాత్రం కచ్చితంగా రెండేసి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Allu-Arjun.jpg

2024లో పుష్పగాడి రూలింగ్ షురూ..

2023లో అభిమానులను నిరాశ పరిచన హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) కూడా ఒకరు. అయితే అభిమానుల పరంగా 2023 మాత్రం.. ఈ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కి కలకాలం గుర్తుండి పోతుంది. ఎందుకంటే.. 2022లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు గానూ అల్లు అర్జున్ 2023లో ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం. అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి లేని, రాని జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకుని అల్లు అర్జున్ (Allu Arjun) చరిత్ర సృష్టించాడు. ఇంకా ఎన్నో అవార్డులు ఈ సంవత్సరం అల్లు అర్జున్‌ని వరించాయి. సినిమాల విషయానికి వస్తే.. ఈసారి రూల్ చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ‘పుష్ప’ పార్ట్ 2 (Pushpa The Rule) షూటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. ప్రస్తుతం యమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా 2024 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ వరల్డ్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా చూస్తే.. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి (వాల్తేరు వీరయ్య, భోళా శంకర్), బాలయ్య (వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి)లు 2023లో రెండేసి సినిమాలతో సందడి చేస్తే.. వెంకీ, నాగార్జున మాత్రం కామ్‌గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ‘బ్రో’తో సందడి చేస్తే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చారు. మిగతా స్టార్ హీరోలు మాత్రం ఈ సంవత్సరం సెట్స్‌లోనే ఉండిపోయారు. 2024లో మాత్రం.. స్టార్ హీరోలందరూ వారి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Jyothika: ముంబైకి మకాం అందుకే.. అసలు విషయం చెప్పేసిన జ్యోతిక

*******************************

*Devil: ‘డెవిల్’ సెన్సార్ టాక్ వచ్చేసింది..

*********************************

*Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..

********************************

*ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం

********************************

*బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?

****************************

Updated Date - Dec 22 , 2023 | 03:30 PM