Jyothika: ముంబైకి మకాం అందుకే.. అసలు విషయం చెప్పేసిన జ్యోతిక

ABN , Publish Date - Dec 21 , 2023 | 08:12 PM

ఈ మధ్య సూర్య తన భార్య కోసం.. తల్లిదండ్రులతో గొడవపడి చెన్నై వదిలి.. ముంబైలో మకాం పెట్టేసినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటిదేమీ లేదని ఒకసారి, పిల్లల చదువు నిమిత్తం ముంబైకి వెళుతున్నట్లుగా.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. సూర్య కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా జ్యోతిక ముంబైకి మకాం మార్చింది ఎందుకునేది చెప్పుకొచ్చింది.

Jyothika: ముంబైకి మకాం అందుకే.. అసలు విషయం చెప్పేసిన జ్యోతిక
Jyothika

ఈ మధ్య సూర్య తన భార్య కోసం.. తల్లిదండ్రులతో గొడవపడి చెన్నై వదిలి.. ముంబైలో మకాం పెట్టేసినట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటిదేమీ లేదని ఒకసారి, పిల్లల చదువు నిమిత్తం ముంబైకి వెళుతున్నట్లుగా.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. సూర్య (Suriya) కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా జ్యోతిక (Jyothika) ముంబైకి మకాం మార్చింది ఎందుకునేది చెప్పుకొచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రుల సంరక్షణ కోసమే తాత్కాలికంగా తాను ముంబైకు వెళ్లినట్టు జ్యోతిక చెప్పుకొచ్చారు. అత్తమామలను వదిలేసి తన భర్త పిల్లలతో కలిసి ముంబైకు వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. (Kollywood Hero Suriya Wife)


suriya.jpg

‘‘కరోనా సమయంలో నా తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది. ఆ సమయంలో విమాన సేవలు లేకపోవడంతో వారి వద్దకు వెళ్లలేకపోయా. 25 యేళ్లుగా చెన్నైలోనే ఉంటున్నా. నా తల్లిదండ్రులతో కలిసి ఉన్న సమయం చాలా తక్కువ. వివాహం తర్వాత ప్రతి మహిళా తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను చూసుకోలేక పోతోంది. వివాహం తర్వాత బాధ్యతలు కూడా పెరిగిపోవడంతో వాటిని పక్కనబెట్టి... తల్లిదండ్రులతో గడపలేని పరిస్థితి నెలకొంది. అందుకే కొంతకాలం వారితో ఉండాలన్న ఆలోచనతోనే ముంబైకు వెళ్లాం. ఇది తాత్కాలిక నిర్ణయం. పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు సులభంగా ఉంది. నా భర్త సూర్య ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు. నేను, పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు’’ అని జ్యోతిక పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Devil: ‘డెవిల్’ సెన్సార్ టాక్ వచ్చేసింది..

*********************************

*Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్, విఐ ఆనంద్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్..

********************************

*ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం

********************************

*బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?

****************************

Updated Date - Dec 21 , 2023 | 08:12 PM