University: ‘యూనివర్సిటీ’లో విలన్‌గా చేసిన ఈ నాయుడు గురించి తెలుసా..?

ABN , First Publish Date - 2023-07-17T21:00:33+05:30 IST

ప్రతిభకు పట్టాభిషేకం చేసే ఆర్.నారాయణ మూర్తి.. ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ చిత్రంలో దాసరి తిరుపతి నాయుడు అనే రిటైర్డ్ టీచర్‌కి పారిశ్రామికవేత్త పాత్రనిచ్చి ప్రోత్సహించారు. ఆ చిత్రంలో తిరుపతి నాయుడు నటనకు ముగ్ధుడైన పీపుల్ స్టార్... తన తదుపరి చిత్రం ‘యూనివర్సిటీ’లోనూ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రనిచ్చి... తెలుగు సినిమా రంగానికి ఒక మంచి నటుడ్ని అందించారు.

University: ‘యూనివర్సిటీ’లో విలన్‌గా చేసిన ఈ నాయుడు గురించి తెలుసా..?
R Narayana Murthy and Dasari Thirupathi Naidu

ఉపాధ్యాయుడిగా వేలాదిమంది విద్యార్థులు ఉన్నత స్థానాలు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు, తన తనయులు ముగ్గురినీ ప్రయోజకులుగా తీర్చిదిద్ది... రంగస్థలం తీర్చని తన నట దాహాన్ని సినిమా రంగంలో తీర్చుకోవాలని తహతలాడుతున్నారు దాసరి తిరుపతి నాయుడు (Dasari Thirupathi Naidu). ఏ పాత్రలోనైనా సునాయాసంగా పరకాయ ప్రవేశం చేయగల ప్రతిభ ఆయన సొంతం. రంగస్థలంపై తన ప్రతిభను ఘనంగా చాటుకున్న తిరుపతి నాయుడు... ఇప్పుడిప్పడే తన నట వైదుష్యాన్ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఉత్తరాంధ్రలో పేరెన్నికగన్న రంగస్థల కళాకారుడు దాసరి అప్పలస్వామి తనయుడైన తిరుపతి నాయుడు... తన తండ్రి నుంచి నటనను పుణికిపుచ్చుకుని.. తండ్రిని మించిన తనయుడిగా పేరు గడించుకున్నాడు.


‘మోహినీ భస్మాసుర’ నాటకంలో భస్మాసుర పాత్రకుగానూ ఉత్తమ నటుడిగా నంది అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు. ఉపాధ్యాయుడిగా తనను తాను నిరంతరం సానబెట్టుకుంటూ... ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు పీ.జీలు చేసి, ఉపాధ్యాయ వృత్తికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసిన తిరుపతి నాయుడు... ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై తన అనుభవాన్ని సినిమా రంగానికి అంకితం చేయాలనేది ముందుకు అడుగు వేస్తున్నారు.

కృష్ణుడు, అర్జునుడు, గయుడు, హరిశ్చంద్రుడు, జరాసంధుడు, భస్మాసురుడు అగ్నిద్యోతనుడు వంటి పౌరాణిక పాత్రలతోపాటు... సాంఘిక పాత్రలతోనూ తనని తాను నిరూపించుకుని.. ఇప్పుడు సినీ రంగాన్ని ఆకట్టుకోవడం ఆరంభించారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలకు భంగం వాటిల్లనివ్వకుండా.. ‘‘ఆ ముగ్గురు, మన్మధరెడ్డి, జనఘోష, అమృతభూమి, వాడు ఎవడు, రహస్యం, సీత, సర్కారువారి పాట’’ వంటి చిత్రాలతో సినిమా రంగానికి తన ఉనికిని పరిచయం చేసుకున్న ఈ ఉత్తరాంధ్ర బిడ్డ... పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి (R Narayana Murthy) కంట్లో పడ్డారు.

Thirupathi.jpg

ప్రతిభకు పట్టాభిషేకం చేసే... ఆర్.నారాయణ మూర్తి.. ‘మార్కెట్‌లో ప్రజాస్వామ్యం’ (Market lo Prajaswamyam) చిత్రంలో పారిశ్రామికవేత్త పాత్రనిచ్చి ప్రోత్సహించారు. ఆ చిత్రంలో తిరుపతి నాయుడు నటనకు ముగ్ధుడైన పీపుల్ స్టార్... తన తదుపరి చిత్రం ‘యూనివర్సిటీ’ (University)లోనూ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రనిచ్చి... తెలుగు సినిమా రంగానికి ఒక మంచి నటుడ్ని అందించారు. ‘నిడివితో నిమిత్తం లేకుండా... పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోకుండా... నటుడిగా నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే నా కోరిక’ అని దాసరి తిరుపతి నాయుడు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

Updated Date - 2023-07-17T22:18:12+05:30 IST