Jayasudha: బెనకా.. ఈ పేరే నేనలా చేసేలా చేసింది..

ABN , First Publish Date - 2023-10-21T20:45:11+05:30 IST

మేము వడ్డీ చెల్లించి మీ బంగారాన్ని విడిపిస్తాం, ఈ రోజు ఉన్న మార్కెట్‌ రేటుతో మీ బంగారంతోపాటు రాళ్ల విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని అంటున్నారు సహజనటి జయసుధ. అదేంటి జయసుధ ఏమైనా బంగారం బిజినెస్ చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటిదేమీ లేదు. తాజాగా ఆమె బెనకా గోల్డ్ యాడ్‌లో కనిపించారు.

Jayasudha: బెనకా.. ఈ పేరే నేనలా చేసేలా చేసింది..
Jayasudha at Benaka Event

మేము వడ్డీ చెల్లించి మీ బంగారాన్ని విడిపిస్తాం, ఈ రోజు ఉన్న మార్కెట్‌ రేటుతో మీ బంగారంతోపాటు రాళ్ల విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని అంటున్నారు సహజనటి జయసుధ (Jayasudha). అదేంటి జయసుధ ఏమైనా బంగారం బిజినెస్ చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటిదేమీ లేదు. తాజాగా ఆమె బెనకా గోల్డ్ (Benaka Gold) యాడ్‌లో కనిపించారు. అంతేకాదు, ఆమె నటించిన ఈ బంగారం కంపెనీ యాడ్‌ హెడ్‌ ఆఫీస్‌‌ను హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో స్వయంగా తన చేతుల మీదుగా జయసుధ శనివారం ప్రారంభించారు.


Jayasudha-1.jpg

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. బెంగుళూరులో తమ సేవలతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది బెనకా గోల్డ్‌ కంపెనీ. అందుకే ఆ సంస్థ యాడ్‌ డైరెక్టర్‌ దీపక్‌ ఆవుల (Deepak Aavula).. మేడమ్‌ మనం యాడ్‌ చేద్దాం అనగానే వెంటనే ఓకే అనేశాను. ఆ కంపెనీ యం.డి భరత్‌ కుమార్‌ (Bharath Kumar) తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని కోరుకుంటున్నాని అన్నారు. బెనకా గోల్డ్‌ సంస్థ యండి యస్‌ భరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో మేము 20 బ్రాంచిలను ప్రారంభిస్తామని తెలపగా.. జయసుధ వంటి గొప్ప నటితో కలిసి పనిచేయటం ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు యాడ్‌ డైరెక్టర్‌ దీపక్‌ ఆవుల.


ఇవి కూడా చదవండి:

============================

*Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

*************************************

*Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

**************************************

*Vishal: విశాల్‌ ఎఫెక్ట్‌.. ఆ చిత్రాల సెన్సార్‌ నిబంధనలలో మార్పు!

************************************

*Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..

******************************************

*Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?

***************************************

Updated Date - 2023-10-21T20:45:11+05:30 IST