Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

ABN , First Publish Date - 2023-10-21T16:21:59+05:30 IST

కుర్రకారు హృద‌యాల‌ను గిలిగింత‌లు పెట్టించే హీరోయిన్స్‌లో క‌త్రినా కైఫ్ మొదటి వరుసలో ఉంటుంది. ఆమె అందం, అభిన‌యం అలాంటిది మరి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘టైగర్ 3’లో జోయా అనే పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని ‘లేకే ప్రభు కా నామ్..’ పాట తనకు ఎంతో ఇష్టమని, ఇందులో 7 అద్భుత‌మైన లుక్స్‌తో అలరిస్తానని కత్రినా చెప్పుకొచ్చింది.

Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..
Katrina Kaif in Tiger 3

కుర్రకారు హృద‌యాల‌ను గిలిగింత‌లు పెట్టించే హీరోయిన్స్‌లో క‌త్రినా కైఫ్ (Katrina Kaif) మొదటి వరుసలో ఉంటుంది. ఆమె అందం, అభిన‌యం అలాంటిది మరి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘టైగర్ 3’ (Tiger 3)లో జోయా (Joya) అనే పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు అద‌రిపొయే యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించ‌ట‌మే కాదు.. క‌ను రెప్ప వేయ‌కుండా వావ్ అనిపించేంత అందంతో ఆక‌ట్టుకునేంత ఆక‌ర్ష‌ణీయంగా ఆమె క‌నిపించ‌నుంది. దీనికి అక్టోబ‌ర్ 23న ఈ చిత్రం నుంచి విడుద‌లవుతున్న ‘లేకే ప్రభు కా నామ్..’ పాట (Leke Prabhu Ka Naam Song) ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వ‌నుంది. ఈ పాట రిలీజ్ త‌ర్వాత ఇంట‌ర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుందని మేకర్సే చెబుతున్నారంటే.. ఇందులో ఆమె ఎలా మెస్మరైజ్ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాట‌లో క‌త్రినా కైఫ్ ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 7 అద్భుత‌మైన లుక్స్‌తో అల‌రించ‌నుందట. ఆమె ఎంటైర్ కెరీర్‌లో ఈ సాంగ్ వ‌న్ ఆఫ్ ది మోస్ట్ ఫేవ‌రేట్ సాంగ్ అని స్వయంగా కత్రినానే చెప్పుకొచ్చింది.

ఈ సంద‌ర్భంగా క‌త్రినా మాట్లాడుతూ.. ‘లేకే ప్రభు కా నామ్’ విజువ‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను అలా క‌ట్టిప‌డేస్తుంది. అందుక‌నే నా ఫేవ‌రేట్ సాంగ్స్‌లో ఇదొక‌టి. ట‌ర్కీలోని కాప్ప‌డోసియా ప్రాంతంలో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. మాషాల్లా, స్వాగ్ సే స్వాగ‌త్ పాట‌ల త‌ర్వాత‌ నా ఫేవ‌రేట్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాట‌లో న‌న్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాట‌లో న‌న్ను ఆమె ఏకంగా ఏడు మెస్మ‌రైజింగ్ లుక్స్‌లో చూపించారు. దేనిక‌దే ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. టైగ‌ర్ ఫ్రాంచైజీ నుంచి వ‌చ్చే పాట ఎప్పుడూ చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలుస్తుంది. అదే కోవలో లేకే ప్ర‌భు కా నామ్ పాట‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఈ పాట‌ను చిత్రీక‌రించిన తీరు.. టైగ‌ర్‌, జోయా మ‌ధ్య ఉండే కెమిస్ట్రీ స‌రికొత్త‌గా అల‌రించ‌నుంది. స‌ల్మాన్‌తో క‌లిసి డాన్స్ చేయ‌టాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. లేకే ప్ర‌భు కా నామ్ పాట చిత్రీక‌ర‌ణ‌లో మ‌ర‌చిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయని తెలిపింది. (Katrina Kaif about Leke Prabhu Ka Naam Song)


Katrina-Kaif.jpg

శుక్ర‌వారం లేకే ప్ర‌భు కా నామ్ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. క్ష‌ణాల్లోనే అది నెట్టింట వైర‌లైంది. ఇక ఫుట్ ట్యాపింగ్ డాన్స్ ట్రాక్ .. స‌ల్మాన్ ఖాన్ (Salman Khan), క‌త్రినా కైఫ్ మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌కు అలా క‌ళ్లు అప్ప‌గించి చూసేలా చేయ‌నుంది. ఈ పాట‌ను ప్రీత‌మ్ కంపోజ్ చేయ‌గా బెన్నీ ద‌యాల్‌, అనుషా మ‌ణి పాడారు. ఈ పార్టీ సాంగ్ ఈ సీజ‌న్‌లో అంద‌రికీ ఫేవ‌రేట్ సాంగ్‌గా నిలవ‌నుంది. వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించే జోడీల్లో స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ ఎప్పుడూ ముందుంటుంది. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో హిస్టారిక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఉన్నాయి. అలాగే తిరుగులేని చార్ట్ బ‌స్ట‌ర్స్ కూడా ఉన్నాయి. మ‌రోసారి ఈ జంట ఆదిత్య చోప్రా ‘టైగ‌ర్ 3’లో టైగ‌ర్ , జోయా పాత్ర‌ల్లో మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. య‌ష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా రూపొందిన ‘టైగ‌ర్ 3’ చిత్రాన్ని మ‌నీష్ శ‌ర్మ (Maneesh Sharma) ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య చోప్రా (Aditya Chopra) నిర్మించారు. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

============================

*Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

**************************************

*Vishal: విశాల్‌ ఎఫెక్ట్‌.. ఆ చిత్రాల సెన్సార్‌ నిబంధనలలో మార్పు!

************************************

*Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..

******************************************

*Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?

***************************************

*Baby Combo Repeats: మళ్లీ కల్ట్ బ్లాక్‌బస్టర్ కాంబో.. కాకపోతే?

*******************************************

Updated Date - 2023-10-21T16:22:07+05:30 IST