Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు

ABN , First Publish Date - 2023-06-01T13:55:58+05:30 IST

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ నుంచి 1993లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘జురాసిక్ పార్క్’. 1993, జూన్ 11న విడుదలైన ఈ చిత్రం.. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇప్పటి వరకు ‘ప్రైడ్ మంత్’‌గా ఉన్న జూన్‌ని.. ఇప్పుడు ‘జురాసిక్ జూన్’‌గా మార్చేసి.. మరోసారి ‘జురాసిక్’ వరల్డ్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు
Jurassic Park Still

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) నుంచి 1993లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘జురాసిక్ పార్క్’ (Jurassic Park). ఈ సినిమాతో స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఓ విప్లవాత్మకమైన మార్పుకు తీసుకొచ్చారు. 1990లో ఇదే పేరుతో వచ్చిన మైఖేల్ క్రిక్టన్ నవల, డేవిడ్ కోప్ స్ర్కీన్‌ప్లే ఆధారంగా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘జురాసిక్ పార్క్’ చిత్రాన్ని రూపొందించారు. ఇది జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో మొదటిది. 1993, జూన్ 11న విడుదలైన ఈ చిత్రం.. ప్రస్తుతం 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఇప్పటి వరకు ‘ప్రైడ్ మంత్’‌గా ఉన్న జూన్‌ని.. ఇప్పుడు ‘జురాసిక్ జూన్’ (Jurassic June)‌గా మార్చేసి.. మరోసారి అందరినీ ‘జురాసిక్’ వరల్డ్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో జూన్‌‌కి ఉన్న ప్రైడ్ మంత్ పేరుని క్యాన్సిల్ చేసి డైనోసార్‌ మంత్‌‌ని తలపించేలా ‘జురాసిక్ జూన్’గా మార్చడంపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో ‘జురాసిక్ పార్క్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Park-pic.jpg

ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన ఓ అద్భుతంగా ఇప్పటికీ చెప్పబడుతుంది. ఈ సినిమా కోసం ఇస్లా నుబ్లార్‌లో వేసిన ద్వీపపు సెట్, అందులో జాన్ హమ్మండ్ (అటెన్‌బరో) అనే సంపన్న వ్యాపారవేత్త మరియు జన్యు శాస్త్రవేత్తల బృందం కలిసి.. అంతరించిపోయిన డైనోసార్‌ల వన్యప్రాణి పార్కును సృష్టించడం, అందులో T-రెక్స్, వెలోసిరాప్టర్ వంటి డైనోసార్స్ నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. 63 మిలియన్ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే ఒక బిలియన్ డాలర్లకు పైగా లాభాన్ని గడించిందంటే.. ఈ సినిమా ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. యానిమాట్రోనిక్ అనే కొత్త పద్దతిలో స్పీల్‌బర్గ్ సృష్టించిన డైనోసార్ల కదలికలు ఎంతో నేచురల్‌గా ఉండడం, CGI సాంకేతికత, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్ బ్లమ్ వంటి నటుల నటన, స్పీల్‌బర్గ్ దర్శకత్వ ప్రతిభ వంటివన్నీ ఈ సినిమాను ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేశాయి. అందుకే 30 సంవత్సరాలు పూర్తయినా కూడా ‘జురాసిక్ పార్క్’ అనగానే ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. (30 Years to Jurassic Park Film)

JP.jpg

ఇది దృష్టిలో పెట్టుకునే ‘జురాసిక్ జూన్’ పేరుతో సరికొత్త ట్రెండ్‌కు మేకర్స్ శ్రీకారం చుట్టారు. జురాసిక్ పార్క్ లెగసీని ప్రపంచమంతా అనుభూతి చెందిందని అన్నారు యూనివర్సల్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ల ఫ్రాంచైజ్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ మెలిస్సా రోడ్రిగ్జ్ (Melissa Rodriguez). “ఈ చిత్రం 30 సంవత్సరాల క్రితం విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల హృదయాలలో మరియు మనస్సులలో స్థిరపడిపోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అభిమానులను సంపాదించుకుంటుంది.

Park.jpg

‘జురాసిక్ జూన్’ పేరుతో ప్రత్యేక ఈవెంట్‌లు, ప్రత్యేకమైన వస్తువులు, గేమ్‌లు వంటివన్నీ లభించేలా ‘జురాసిక్ పార్క్’ ట్రిబ్యూట్ స్టోర్ లాంచ్ చేశాం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను మరింత సంతోషపరిచేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం” అని ఆయన చెప్పుకొచ్చారు. యూనివర్సల్ ఓర్లాండోలో ‘జురాసిక్ పార్క్’ సందడి ఇప్పటికే ప్రారంభమైందని.. జూన్ 9, జూన్ 10 మరియు జూన్ 11న సిటీవాక్‌లోని యూనివర్సల్ సినిమార్క్‌లో జురాసిక్ పార్క్ ప్రదర్శనలు జరుగుతాయని ఆయన తెలిపారు. జురాసిక్ పార్క్ ప్రస్తుతం హులులో ప్రసారం అవుతోంది.

Sridevi.jpg

‘జురాసిక్‌ పార్క్‌’ ఛాన్స్‌ను వదులుకున్న శ్రీదేవి (Sridevi)

హాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్ అంటే ఇప్పటి హీరోయిన్లు అయితే ఎగిరి గంతేస్తారు. డబ్బుకు డబ్బు.. కావాల్సినంత పబ్లిసిటీ రెండూ ఒకేసారి వచ్చి పడతాయి. అందులోనూ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మూవీ‌లో ఛాన్స్ అంటే కళ్లు మూసుకుని మరీ ఓకే చెప్పేస్తారు. కానీ, అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి మాత్రం ‘జురాసిక్‌ పార్క్‌’ నటించే అవకాశం వస్తే.. నో చెప్పారట. ఈ విషయంలో స్వయంగా శ్రీదేవే తన ‘మామ్’ (Mom) మూవీ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. ‘ఆ రోజుల్లో హాలీవుడ్‌ సినిమాలంటే ఏలియన్‌లా చేయడమే. కానీ, ఇప్పుడు అదొక గౌరవం. అందుకే అప్పట్లో జురాసిక్ పార్క్‌లో ఛాన్స్ వచ్చినా చేయలేదు’ అని శ్రీదేవి ‘మామ్’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?

*Srikanth Addala: ‘అఖండ’ బ్యానర్‌లో శ్రీకాంత్ అడ్డాల సినిమా.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

*RRR: చరణ్, ఎన్టీఆర్ కాదు.. అసలు సిసలైన ‘RRR’ కాంబినేషన్ ఇదే.. వీడియో వైరల్

Updated Date - 2023-06-01T14:13:14+05:30 IST