Citadel trailer: ‘ఏ దేశానికి విధేయులం కాదు’.. ప్రియాంక చోప్రా ఈజ్ బ్యాక్ అంటూ..

ABN , First Publish Date - 2023-03-07T13:02:55+05:30 IST

బాలీవుడ్‌ (Bollywood)లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra).

Citadel trailer: ‘ఏ దేశానికి విధేయులం కాదు’.. ప్రియాంక చోప్రా ఈజ్ బ్యాక్ అంటూ..
Citadel

బాలీవుడ్‌ (Bollywood)లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ఎంతోమంది భారతీయ నటులు హాలీవుడ్ (Hollywood) చిత్రాల్లో ప్రయత్నించినప్పటికీ అక్కడ సక్సెస్ కాలేకపోయారు. ఈ తరుణంలో.. ప్రియాంక మాత్రం అక్కడ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతోంది. గతేడాది ‘మ్యాట్రిక్స్ 4’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ తాజాగా ‘సిటడెల్’ (Citadel) అనే వెబ్‌సిరస్‌లో నటించింది.

మార్వెల్ సినిమాలైన ‘అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవేంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రాలతో దర్శకులుగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన రుస్సో బ్రదర్స్ ‘సిటడెల్’‌ని నిర్మించారు. ప్రియాంకతో పాటు రిచర్డ్ మడ్సన్, రిచర్డ్ టుస్సీ కీలకపాత్రలు పోషించారు. దీంతో ఈ వెబ్‌సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఇందులో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటించడం వల్ల ఇండియాలో ఈ వెబ్‌సిరీస్‌పై క్రేజ్ మరింత పెరిగింది.

‘సిటడెల్’ ఏప్రిల్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ తరుణంలోనే తాజాగా ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ని ఆ ఓటీటీ యాజమాన్యం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ చూసి ప్రియాంక అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ ట్రైలర్‌ని చూస్తే ప్రియాంక గూడఛారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోని డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కథేనంటనేది అర్థం కాకపోయినప్పటికీ వెబ్‌సిరీస్‌పై చాలా ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. దీంతో ‘ప్రియాంక ఈజ్ బ్యాక్’ అంటూ ఈ భామ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇదే వెబ్‌సిరీస్‌ని భారతీయులకి అనుగుణంగా రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-07T13:13:41+05:30 IST