Oscars 95: ‘ఆర్ఆర్ఆర్’ని బాలీవుడ్ మూవీ అన్నాడు.. ఈ సారి నోబెల్ గ్రహీతతో అలా మాట్లాడాడు.. మరో వివాదంలో ఆస్కార్ హోస్ట్..

ABN , First Publish Date - 2023-03-14T14:23:18+05:30 IST

గత కొన్ని రోజుల సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్స్ 2023 (Oscars 2023) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

Oscars 95: ‘ఆర్ఆర్ఆర్’ని బాలీవుడ్ మూవీ అన్నాడు.. ఈ సారి నోబెల్ గ్రహీతతో అలా మాట్లాడాడు.. మరో వివాదంలో ఆస్కార్ హోస్ట్..

గత కొన్ని రోజుల సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్స్ 2023 (Oscars 2023) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు సినీ పరిశ్రమల నుంచి అతిరథమహారథుల హాజరై ఈ వేడుకని విజయవంతం చేశారు. అంతేకాకుండా.. ఈ వేడుకకి పలువురు ఇతర రంగాలకి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే.. ఈ సారి జరిగిన ఆస్కార్‌కి హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ (Jimmy Kimmel) తన వాక్చాతుర్యం కంటే వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.

ఆ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా గురించి మాట్లాడుతూ బాలీవుడ్ సినిమా అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో టాలీవుడ్‌తో ఇతర సౌతిండియా సినీ ప్రేక్షకులు ఆయన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. తాజాగా జిమ్మీ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఈసారి నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్ జాయ్‌ జరిగిన చర్చ కారణంగా. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆయన్ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. (Oscar 95)

ఆ వీడియోలో.. మలాలా యూసఫ్‌జాయ్‌ (Malala Yousafzai) దగ్గరకి వెళ్లి, ఒక అభిమాని అడిగిన ప్రశ్నను చదివాడు. తన స్పందనని అడిగాడు. అందులో.. ‘మానవ హక్కులు, స్త్రీలు, పిల్లలకు విద్యపై మీరు చేస్తున్న కృషి, చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన నోబెల్ బహుమతి విజేత మీరు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అయితే క్రిస్ పైన్‌పై హ్యారీ స్టైల్స్ ఉమ్మేశాడని మీరు అనుకుంటున్నారా?’ అని ఓ అర్థం లేని ప్రశ్నను అడిగాడు. అది విన్న మలాలా చాలా సింపుల్‌గా ‘నేను శాంతి గురించి మాత్రమే మాట్లాడతాను’ అని సమాధానం చెప్పింది. అది విన్న జిమ్మీ వెంటనే తెలివైన సమాధానం అన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

దీంతో ‘ఎందుకు ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడుగుతారు’.. ‘ఎప్పుడో అయిపోయిన విషయాల గురించి ఎందుకు అడుగుతున్నారు’.. ‘ఈ విషయంలో మాలాలాకి జీమ్మి క్షమాపణలు చెప్పాలి’ అని వరుసగా కామెంట్స్ రాసుకొచ్చారు.

‘డోన్ట్ వర్రీ డార్లింగ్’ అనే చిత్రంలో క్రిస్ పైన్‌, హ్యారీ స్టైల్స్ సహానటులు. వీరిద్దరూ కలిసి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో అనుకోకుండా క్రిస్ పైన్‌పై హ్యారీ స్టైల్స్ ఉమ్మేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దానిపై నెటిజన్లు రెండుగా విడిపోయిన కొట్టుకున్నారు. అతను నిజంగా ఉమ్మేయాలేదని కొందరు అతని సపోర్టు చేయగా.. ఉమ్మేశాడని కొందరూ విమర్శలు చేశారు. ఆ విషయం గురించి తాజాగా ఆస్కార్స్‌లో మాలాలాని జిమ్మీ ప్రశ్నించాడు.

ఇవి కూడా చదవండి:

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Updated Date - 2023-03-14T14:27:38+05:30 IST