Oscar 2023: ఓ ఆస్కార్ కొట్టేశాం.. ఏ చిత్రానికంటే..

ABN , First Publish Date - 2023-03-13T08:16:00+05:30 IST

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Oscar 2023: ఓ ఆస్కార్ కొట్టేశాం.. ఏ చిత్రానికంటే..

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో భారతదేశానికి చెందిన పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సారి జరిగే ఆస్కార్స్‌లో మూడు విభాగాల్లో భారతదేశానికి చెందిన చిత్రాలు పోటీ పడుతున్నాయి. ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్‌’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన పాట ‘నాటు నాటు’ (Naatu Naatu), బెస్ట్ డాక్యుమెంటరీ ఫిచర్ విభాగంలో ‘అల్ దట్ బ్రీత్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (the elephant whispers) కూడా నామినేషన్ దక్కించుకున్నాయి.

elephents1.jpg

తాజాగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగం అవార్డులను ప్రకటించగా.. ‘ది ఎలిఫెండ్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీకి కార్తికి గోన్‌సాల్వెస్‌ దర్శకత్వం వహించారు. ఈ దర్శకురాలే స్వయంగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు.

తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు దొరుకుతుంది. వారు దాన్ని పెంచుకుంటారు. ఈ తరుణంలో ఆ ఏనుగుతో వారికి ఏర్పడిన అనుబంధం గురించి ఈ షార్ట్ ఫిల్మ్‌లో చూపించారు. అందులో ఆ దంపతులు, ఏనుగు మధ్య అనుబంధం అందరినీ కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి:

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Writer Padmabhushan OTT Streaming: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Updated Date - 2023-03-13T08:32:55+05:30 IST