Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి

ABN , First Publish Date - 2023-07-28T17:08:24+05:30 IST

హీరో అజిత్‌ కుమార్‌ నటించే కొత్త చిత్రం ‘విడాముయర్చి’లో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడామె ప్లేస్‌లో తమన్నాను ఎంపిక చేయనున్నారు. తమన్నా గతంలో అజిత్‌ సరసన ‘వీరమ్‌’ చిత్రంలో నటించారు. ఇపుడు కూడా అజిత్‌ సూచన మేరకు మిల్కీబ్యూటీ తమన్నాను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి
Tamannaah and Ajith Kumar

హీరో అజిత్‌ కుమార్‌ నటించే కొత్త చిత్రం ‘విడాముయర్చి’ (Vidamuyarchi)లో హీరోయిన్‌గా త్రిష (Trisha)ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడామె ప్లేస్‌లో తమన్నా (Tamannaah)ను ఎంపిక చేయనున్నారు. తమన్నా గతంలో అజిత్‌ సరసన ‘వీరమ్‌’ (Veeram) చిత్రంలో నటించారు. ఇపుడు కూడా అజిత్‌ సూచన మేరకు మిల్కీబ్యూటీ తమన్నాను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్లుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘తుణివు’ సక్సెస్‌ తర్వాత అజిత్‌ హీరోగా మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత నెలలోనే షూటింగ్‌ ప్రారంభంకావాల్సి ఉండగా, కొన్ని కారణాలతో సెట్స్‌పైకి వెళ్ళలేదు. వచ్చే నెల నుంచి షూటింగ్‌ చేపట్టేలా ప్లాన్‌ చేశారు.


అయితే, ఇందులో హీరోయిన్‌గా త్రిషను తొలుత ఎంపిక చేశారు. కానీ, షూటింగ్‌ ప్రారంభంకావడంలో జాప్యం చోటు చేసుకోవడంతో ఆమె తన కాల్షీట్స్‌ సర్దుబాటు చేయలేని పరిస్థితి తలెత్తడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హీరో అజిత్‌ సూచన మేరకు మిల్కీబ్యూటీని సంప్రదిస్తున్నారు. అయితే, ఇందులో తమన్నా నటిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Tamanna.jpg

మరో వైపు తమన్నా కోలీవుడ్‌లో నటించిన ‘జైలర్’ (Jailer) ఆగస్ట్ 10వ తేదీన విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో తమన్నా పాల్గొంటుండగా.. అజిత్ రీసెంట్‌గా టూర్ ముగించుకుని వచ్చారు. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేవు కాబట్టి.. కచ్చితంగా అజిత్‌తో సినిమాకు ఆమె ఓకే చెప్పే అవకాశమే ఉంది. చూద్దాం.. ఫైనల్‌గా ‘విడాముయర్చి’లో హీరోయిన్ ఎవరో?


ఇవి కూడా చదవండి:

**************************************

* Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు

*************************************

*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

**************************************

*Anuj Gurwara: పాటలు పాడుకోకుండా.. ఎందుకయ్యా నీకీ భజన?

**************************************

*Rajasekhar: ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్.. ‘భోళా శంకర్’లో చిరు.. మాములుగా వాడలేదుగా..

**************************************

*Jailer: తెలుగులోనూ దుమ్మురేపుతోన్న తమన్నా ఆట.. ‘జైలర్’ పాట

**************************************

Updated Date - 2023-07-29T22:31:39+05:30 IST