NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

ABN , First Publish Date - 2023-05-07T12:05:55+05:30 IST

వెండితెర, బుల్లితెర, ఓటీటీ అనే తేడాల్లేవు. అన్ని చోట్లా... అద్భుతాలు సృష్టించడానికి రెడీగానే ఉన్నారు కథానాయకులు. వేదికలు అనేవి తమ ప్రావీణ్యం చూపించేందుకు ఓ వేదిక మాత్రమే. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..

NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?
Young Tiger NTR

వెండితెర, బుల్లితెర, ఓటీటీ అనే తేడాల్లేవు. అన్ని చోట్లా... అద్భుతాలు సృష్టించడానికి రెడీగానే ఉన్నారు కథానాయకులు. వేదికలు అనేవి తమ ప్రావీణ్యం చూపించేందుకు ఓ వేదిక మాత్రమే. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR).. బుల్లితెరపై కూడా తానెన్ని అద్భుతాలు చేయగలడో ఇది వరకే నిరూపించేశారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ (MEK), ‘బిగ్‌ బాస్‌’ (Bigg Boss) షోలతో అభిమానుల్ని అలరించాడు. పాత్ర ఏదైనా.. ఘట్టం ఏదైనా నే.. నేను రెడీ అని దూకేసే యంగ్ టైగర్.. ఇప్పుడు మరోసారి బుల్లితెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలో బుల్లితెరపై ప్రసారం కాబోతోన్న ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసేందుకు తారక్ (Tarak) రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

విషయంలోకి వస్తే.. ఈటీవీ విన్‌ సంస్థ ఓ రియాలిటీ షో ప్లాన్‌ చేస్తోందట. ఈ షోకి వ్యాఖ్యాతగా (Host) ఎన్టీఆర్‌ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని టాక్‌. ప్రస్తుతం ఈటీవీ యాజమాన్యంతో ఎన్టీఆర్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. పారితోషికం, డేట్లు.. వీటిపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ షో ముందుకు వెళ్తుంది. పూర్తి వివరాలైతే ఇంకా బయటికి రాలేదు కానీ.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ విషయంపై బాగానే చర్చలు నడుస్తున్నాయి. అన్నీ సెట్ అయితే మాత్రం.. తారక్ మరోసారి బుల్లితెరపై తళుక్కుమనడం ఖాయం అని చెప్పొచ్చు.

NTR-Hero.jpg

తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘NTR30’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటోంది. మరోవైపు ఎన్టీఆర్‌ కొత్త కథల్ని సైతం వింటున్నారు. ప్రస్తుతం ‘NTR30’ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో తెరకెక్కబోయే ‘వార్ 2’ (War 2) చిత్రంలో నటించనున్నారు. ఆ తదుపరి ‘కెజియఫ్’ (KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ చిత్రాన్ని ఆయన ఓకే చేసి ఉన్నారు. ఇవి కాకుండా మరో రెండు ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌లను ఆయన లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. వాటి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Pic Talk: చందురుని మించు అందమొలికించు...

*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను

*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!

*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...

*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు

*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్

*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు

Updated Date - 2023-05-07T12:10:19+05:30 IST