Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్

ABN , First Publish Date - 2023-05-05T14:07:16+05:30 IST

స్టార్ హీరోల సినిమాలలో అయితే అసలు ఊహిండమే కష్టం. అలాంటిది ఇప్పుడు హీరో ఉన్న సినిమాలో హీరోయిన్‌పై సోలో సాంగ్‌ని..

Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్
Divyansha Kaushik In Takkar Movie

ఈ మధ్య కాలంలో హీరోలు ఉన్న సినిమాలలో హీరోయిన్లపై సోలో సాంగ్స్ అస్సలు ఉండటం లేదు. స్టార్ హీరోల సినిమాలలో అయితే అసలు ఊహిండమే కష్టం. అలాంటిది ఇప్పుడు హీరో ఉన్న సినిమాలో హీరోయిన్‌పై సోలో సాంగ్‌ని చిత్రీకరించారు. ఏం సినిమా.. ఎవరా హీరోయిన్? అనే విషయంలోకి వస్తే.. తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించే తమిళ హీరోలలో సిద్ధార్థ్ (Siddharth) ఒకరు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అభిమానాన్ని చూరగొన్న ఈ చార్మింగ్ హీరో ఇప్పుడు ‘టక్కర్’ (Takkar)తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ సరసన దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) కథానాయికగా నటిస్తోంది. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘కయ్యాలే’ (Kayyaale Video Song) అనే సాంగ్ ఫుల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ కేవలం హీరోయిన్‌పైనే చిత్రీకరించారు.

Kaushik-0.jpg

సిక్కింలోని బుద్ధ పార్క్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. వాంచినాథన్ మురుగేశన్ తన కెమెరాతో బంధించిన ప్రకృతి అందాలు కట్టిపడేసేలా ఉన్నాయి. నివాస్ కె ప్రసన్న అందించిన మ్యూజిక్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. ఇక దివ్యాంశ కౌశిక్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. కథానాయిక స్వభావాన్ని, సమాజం పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని తెలిపేలా ఈ పాట సాగింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ క్యాచీ‌గానూ, అర్థవంతంగానూ ఉన్నాయి. నిరంజనా రామన్ ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. (Kayyaale Video Song from Takkar)

Kaushik-1.jpg

అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. హీరో సిద్ధార్థ్ (Hero Siddharth) కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా తనని మళ్లీ బిజీ హీరోని చేస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు

*Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..

*Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..

*Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

Updated Date - 2023-05-05T14:07:16+05:30 IST