Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే

ABN , First Publish Date - 2023-08-02T15:12:10+05:30 IST

ఎలాంటి చిత్రమైనా సరే.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే తాను నటించబోనని హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ తెగేసి చెప్పారు. అలాగే, మరికొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ‘మాస్టర్’ సినిమాతో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మాళవికా మోహనన్.. తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.

Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే
Malavika Mohanan

ఎలాంటి చిత్రమైనా సరే.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే తాను నటించబోనని హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ (Malavika Mohanan) తెగేసి చెప్పారు. అలాగే, మరికొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ‘మాస్టర్’ (Master) సినిమాతో నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మాళవికా మోహనన్.. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లామర్‌గా కనిపించే క్రమంలో అస్సలు అడ్డు చెప్పని ఈ భామ.. నటిగా మాత్రం తన పాత్రకు కచ్చితంగా ప్రాధాన్యం ఉండాల్సిందేనని అంటోంది.


ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ... ‘‘నేను సినిమా పరిశ్రమకు వచ్చి పదేళ్లు పూర్తయింది. ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకున్నా. ఇకపై నటించే చిత్రాల్లో నా పాత్రకు ప్రాధాన్యం లేకపోతే అంగీకరించను. రూ. 500 కోట్లు వసూలు చేసే చిత్రమైనప్పటికీ నా పాత్రకు ప్రాధాన్యం ఉండాల్సిందే. ఒక చిత్రం భారీ కలెక్షన్లు సాధించినప్పటికీ... పాత్రకు ప్రాముఖ్యం లేకపోతే ప్రేక్షకుడు దాన్ని గుర్తు పెట్టుకోరు. అందుకే ఇలాంటి జాగ్రత్త తీసుకున్నా. (Malavika Mohanan About Movie Roles)

Malavika.jpg

నేను నా చిన్నప్పటి నుంచి అభిమానించే నటీమణుల్లో శోభన, ఊర్వశి, కాజల్‌, మాధురిదీక్షిత్‌ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నా వారు మాత్రం ప్రేక్షకుల మనసులో స్థిరస్థాయిగా ఉన్నారు. మంచి చిత్రాలను తెరకెక్కించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేయాలని ఉంది’’ అని మాళవికా మోహనన్‌ చెప్పుకొచ్చారు. అయితే రోజుకో కొత్త హీరోయిన్ దిగుతోన్న ఇండస్ట్రీలో ఇలాంటి నియమాలు పెట్టుకుంటే ముందుకెళ్లడం కష్టమని.. మాళవికకు కొందరు సలహాలు ఇస్తున్నారట. ఇప్పుడిలా నియమాలు పెట్టుకుని.. తర్వాత అవకాశాలు రాలేదని ఇండస్ట్రీపై దుమ్మెత్తిపోసేకంటే.. వచ్చిన అవకాశాలలో నటించుకుంటూ వెళ్లడమే బెటర్ అని అభిమానులు కూడా ఆమెకు కామెంట్ల రూపంలో తెలియజేస్తుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

**************************************

*VK Naresh: కోర్టులో నరేష్‌కి ఊరట.. రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం

********************************************

*Kalyani: దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

**************************************

*VD13: సెట్స్‌లో మృణాల్‌ని సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ

**************************************

*Pawan Kalyan: సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా..

**************************************

Updated Date - 2023-08-02T15:12:10+05:30 IST