Shantala: ‘శాంతల’కు మాటల మాంత్రికుడు సపోర్ట్

ABN , First Publish Date - 2023-10-21T19:42:27+05:30 IST

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు సమర్పణలో.. ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాంతల’. నీహల్ హీరోగా నటించిన ఈ పిరియడ్ చిత్రాన్ని త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రైజ్ ఆఫ్ శాంతల’ పాటను త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Shantala: ‘శాంతల’కు మాటల మాంత్రికుడు సపోర్ట్
Shantala Song Launch

ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు సమర్పణలో.. ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ (Ashlesha Thakur) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాంతల’ (Shantala). నీహల్ (Nihal Kodhaty) హీరోగా నటించిన ఈ పిరియడ్ చిత్రాన్ని త్రివిక్రమ్ శేషు (Trivikram Seshu) దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రైజ్ ఆఫ్ శాంతల’ పాటను మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రైజ్ ఆఫ్ శాంతల’ పేరుతో విడుదలైన ఈ పాటకు శ్రీమణి (Shree Mani) సాహిత్యం అందించారు. అరవింద్, శిబి శ్రీనివాస, దేవు మ్యాథ్యూ, ప్రియా ప్రకాశ్, త్రియా సుష్మ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


Shantala.jpg

పాట విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.. మా ‘శాంతల’ చిత్రంలోని మొదటి పాట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా యూనిట్ మొత్తం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పాట చూసిన త్రివిక్రమ్‌గారు.. మంచి ప్రయత్నం చేస్తున్నారంటూ అభినందించారు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా ‘శాంతల’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నవంబర్ 3వ తారీఖున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ‘సీతారామం’ చిత్రానికి సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar).. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. (Rise of Shantala)


ఇవి కూడా చదవండి:

============================

*Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

*************************************

*Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

**************************************

*Vishal: విశాల్‌ ఎఫెక్ట్‌.. ఆ చిత్రాల సెన్సార్‌ నిబంధనలలో మార్పు!

************************************

*Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’.. ఇది ఆరంభం మాత్రమే! ముందుండాది..

******************************************

*Dude: ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’.. షూట్ మొదలయ్యేది ఎప్పుడంటే?

***************************************

Updated Date - 2023-10-21T19:42:27+05:30 IST