సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

ABN, First Publish Date - 2023-04-26T13:01:45+05:30

కోలీవుడ్‌ (Kollywood)కి చెందిన సముద్రఖని.. ఇప్పుడు టాలీవుడ్‌ (Tollywood)లో ఏ రేంజ్‌లో చక్రం తిప్పుతున్నాడంటే.. తెలుగు దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలను

Actor and Director Samuthirakani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఉన్న మల్టీ టాలెంటెడ్ నటులలో తమిళ నటుడు ‘సముద్రఖని’ (Samuthirakani) ఒకరు. కోలీవుడ్‌ (Kollywood)కి చెందిన ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్‌ (Tollywood)లో ఏ రేంజ్‌లో చక్రం తిప్పుతున్నాడంటే.. తెలుగు దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టించేంతగా. సముద్రఖని వచ్చాక ప్రకాష్ రాజ్ వంటి వారికి అవకాశాలు తగ్గాయి. ఇక నటుడిగానే కాకుండా.. స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) వంటి హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఆయనకి దక్కింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘వినోదయ్య సిత్తం’ (Vinodhaya Sitham) చిత్రాన్ని పవన్, సాయిధరమ్‌లతో సముద్రఖని రీమేక్ చేస్తున్నారు. ‘PKSDT’ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పుడీ చిత్ర దర్శకుడిని ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది. ఏప్రిల్ 26 సముద్రఖని పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘PKSDT’ సెట్‌లో పవన్, సాయిధరమ్ తేజ్‌లను డైరెక్ట్ చేస్తున్న సముద్రఖని పిక్‌ని మేకర్స్ విడుదల చేశారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కూడా ప్రత్యేకంగా సముద్రఖనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన ట్విట్టర్ వేదికగా.. ‘బ్రిలియంట్ దర్శకుడు సముద్రఖనిగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడు మీకు సకల సౌభాగ్యాలు అందివ్వాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దర్శకుడు సముద్రఖనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. అందులో..

‘‘ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో అటువంటి సమాజం కోసం తపిస్తారు. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. నటుడిగా జాతీయ స్థాయి పురస్కారాన్ని (National Award) అందుకున్నారు. నేను నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. శ్రీ మూకాంబికా అమ్మవారి భక్తుడైన సముద్రఖనికి ఆ జగజ్జనని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను..’’ అని తెలిపారు. ‘PKSDT’ విషయానికి వస్తే.. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), జీ స్టూడియోస్ (Zee Studios) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

************************************************

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

*Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్

*IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?

*Amala Paul: కథ డిమాండ్‌ చేస్తే.. నగ్నంగా నటించేందుకు ఎలాంటి బెరుకు లేదు

*Virupaksha Director: సాయితేజ్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయినప్పుడు.. కార్తీక్ పరిస్థితి ఏంటంటే..

Updated Date - 2023-04-26T13:01:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!